అదానికి మరో భారీ షాక్..అమెరికా దర్యాప్తు చేస్తుందనే వార్తలు మధ్య కుప్పకూలిన షేర్లు

దేశంలో వ్యాపార రంగంలొ టాప్ దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదాని నేతృత్వంలోని అదాని గ్రూప్ మళ్లీ వివాదంలో చిక్కుకుంది. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముద్రా పోర్ట్ ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్‌ ఎల్‌పీజీ (ఇరానియన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులు) దిగుమతి చేసుకునేందుకు అదాని గ్రూప్ సహకరించిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్విస్టిగేషన్ ప్రారంభించినట్లు యూఎస్ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా కథనాన్ని వెలువరించింది.

ఈ ఆరోపణలు ఒక్కసారిగా వెలువెత్తడంతో అదాని గ్రూపు షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే అదానీ గ్రూప్ స్టాక్స్ పైన ఈ ఆరోపణల ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, SEZ, పవర్‌తో సహా అదానీ గ్రూప్ స్టాక్స్ 1 శాతం నుండి 2.5 శాతం వరకు పడిపోయాయి.ఇక మరో గ్రూపె అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర 2.63 శాతానికి పడిపోగా.. అదానీ పోర్ట్స్ షేర్ ధర 2.72 శాతానికి పడిపోయింది. మిగిలిన గ్రూపులు అదానీ టోటల్ గ్యాస్ , అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్ షేర్లు కూడా 1% నుండి 2% మధ్య తగ్గుదలను నమోదు చేశాయి.

Adani Group Adani stocks fall Mundra port Iranian LPG import Adani Enterprises LPG sanctions Iran LPG news Adani denial Indian stock market Adani controversy Adani LPG allegations Mundra LPG shipment Adani Group news stock dip Adani

ఈ ఆరోపణలపై అదాని గ్రూప్ తాజాగా స్పందించింది. ఇరాన్‌ నౌకలు ఏవీ కూడా ఎల్‌పీజీతో తమ ముద్రా రేవులకు రాలేదని స్పష్టం చేసింది.దీనిపై అమెరికా సంస్థలు దర్యాప్తు జరుపుతున్న విషయం కూడా తమకు తెలియదని స్పష్టం చేసింది. తమ కంపెనీ పేరు ప్రతిష్ఠలను చెడగొట్టేందుకు కొన్ని కంపెనీలు కావాలనే దురుద్దేశంతో తమపై ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తున్నారని మండిపడింది.

అదానీ గ్రూప్‌ ఓ ప్రకటనలో..గుజరాత్ లోని ముద్రా ఓడరేవుల ద్వారా ఇరాన్‌ నుంచి వచ్చే ఎలాంటి సరుకుల ఎగుమతి, దిగుమతులను కంపెనీ అనుమతించడం లేదు. ఇరాన్‌ జెండాతో వచ్చే నౌకలు లేదా నేరుగా ఇరాన్‌ రేవుల నుంచి వచ్చే నౌకలు అన్నిటికి ఈ సూత్రం వర్తిస్తుందని అదాని గ్రూపు తెలిపింది.అది మా విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. WSJ మా కంపెనీనీపై రాసిన న్యూస్ పూర్తిగా దురుద్దేశంతో కూడుకున్నదని అదాని గ్రూపు స్పష్టం చేసింది.

అదానీ గ్రూప్ ప్రతిష్టను దిగజార్చే ఈ ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపక్షేంచేది లేదని.. కంపెనీ ప్రయోజనాలను దెబ్బ తీస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వంగా తప్పుడు కథనాలను రాస్తే సహించేది లేదని అదాని గ్రూపు తేల్చి చెప్పింది.

గతంలో కూడా అదాని గ్రూపుపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు భారీగా లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదానీతో పాటు, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు వ్యక్తులు కాంట్రాక్టులు పొందేందుకు భారత అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్టు అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

రెండు దశాబ్దాలలో 2 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించే లక్ష్యంతో ఈ కాంట్రాక్టులను పొందేందుకు తద్వారా భారత అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సులభతరం చేయడానికి ఈ లంచాల వ్యవహారం జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి.ఆ ఆరోపణలు వచ్చిన ఒక్కరోజే షేర్లు కుప్పకూలి రూ. 2 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+