Adani News: దేశాలు మారుస్తూ దూకుడు పెంచిన గౌతమ్ అదానీ.. ఆ షేర్లున్న ఇన్వెస్టర్లకు పండగే..
Gautam Adani: దేశంలోని అగ్రవ్యాపార వేత్తలో ఒకరిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ మోదీ ప్రధానిగా మూడోసారి ఎన్నిక అవటంతో స్పీడు పెంచారు. గతంలో ఇండియాలో వ్యాపార విస్తరణ చేసిన ఆయన ప్రస్తుతం విదేశాల్లోనూ అదే దూకుడును కొనసాగిస్తున్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్‌గేతో సమావేశమయ్యారు. చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల హైడ్రాలిక్ పవర్ కోసం డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. అలాగే కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ దృష్టిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భూటాన్ చేస్తున్న కృషిని గౌతమ్ అదానీ ప్రశంసించారు. భూటాన్‌లో జలవిద్యుత్, ఇతర ప్రాజెక్టులకు సహకరించేందుకు అదానీ సుముఖత వ్యక్తం చేశారు.

అదానీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ను కూడా కలిశారు. భూటాన్ కోసం రాజు దృక్పథం, గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ కోసం పర్యావరణ అనుకూల మాస్టర్ ప్లాన్ నుంచి ప్రేరణ పొందారు. ఇదే క్రమంలో అదానీ మాట్లాడుతూ కార్బన్ నెగటివ్, గ్రీన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ కోసం ఈ పరివర్తన కార్యక్రమాలపై సహకరించడానికి తాను సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత వార్తలు అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ షేర్లకు సానుకూలమైనదిగా తెలుస్తోంది. ఈ కంపెనీల్లో ఇప్పటికే షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు రేపు మార్కెట్లో లాభాలను పొందే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. అదానీ పవర్ షేర్లు గత ఏడాదిలో దాదాపు 183% మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. కాగా అదానీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 88 శాతం జంప్ నమోదు చేసింది. ఇదే కాలంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్ 13.78% మాత్రమే లాభపడింది.


Click it and Unblock the Notifications