For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: అదానీకి కేంద్రం నుంచి లైన్ క్లియర్.. త్రిముఖ వ్యూహం.. జియో వేగానికి కళ్లెం తప్పదా..?

|

Adani: అదానీ గ్రూప్ తన అవసరాల కోసం అంటూ తాజాగా జరిగిన స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంది. దీనికి ముందు కేవలం కొద్ది నెలల కిందట మోదీ ప్రభుత్వం దేశంలోని వ్యాపార సంస్థలు తమ అవసరాల కోసం స్పెక్ట్రమ్ కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇది అదానీ గ్రూప్ కోసమే జరిగిందా అనే అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి. అయితే దీని వెనుక అసలు మాస్టర్ ప్లాన్ వేరే ఉన్నట్లు కనిపిస్తోంది.

పూర్తి స్థాయి లైసెస్స్..

పూర్తి స్థాయి లైసెస్స్..

కంపెనీ అవసరాల కోసం అంటూ అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ADNL) స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంది. అయితే ఇప్పుడు కంపెనీకి టెలికాం శాఖ నుంచి పూర్తి స్థాయి ఏకీకృత లైసెన్స్ మంజూరు చేయబడింది. ఈ లైసెన్స్ ద్వారా కంపెనీ దేశంలోని అన్ని రకాల టెలికాం సేవలను అందించేందుకు పూర్తి అనుమతి లభించింది. ఎందుకంటే అదానీ డేటా నెట్‌వర్క్స్ లిమిటెడ్ కు ఇంటిగ్రేటెడ్ టెలికాం లైసెన్స్ మంజూరు చేయబడినట్లు తెలుస్తోంది.

అదానీ 5జీ..

అదానీ 5జీ..

సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈ లైసెన్స్ ద్వారా అదానీ.. కాలింగ్, ఇంటర్నెట్ సేవలను అందించడానికి అర్హత లభించింది. కంపెనీ భవిష్యత్తులో టెలికాం రంగంలోకి ఎప్పుడు కావాలనుకున్నా అరంగేట్రం చేయవచ్చు. అదానీ ప్రవేశం వొడాఫోన్-ఐడియాతో పాటు జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలకు ప్రస్తుతం కొత్త సవాలుగా మారనుంది.

అధికారుల నుంచి..

అధికారుల నుంచి..

అదానీ డేటా నెట్‌వర్క్‌లు UL(AS) లైసెన్స్‌ పొందినట్లు టెలికాం అధికారి ఒకరు వెల్లడించారు. ఇది సోమవారం జరిగినట్లు మరో అధికారి స్పష్టం చేశారు. అదానీ త్రిముఖ వ్యూహంతో ముందుకొస్తే.. దేశంలో ప్రస్తుతం మిగిలి ఉన్న మూడు టెలికాం ఆపరేటర్లు పెను ప్రమాదంలో పడతాయి.

 కంపెనీ ఏమేమి కొందంటే..

కంపెనీ ఏమేమి కొందంటే..

ఇటీవలి 5G స్పెక్ట్రమ్ వేలంలో ADNL 20 ఏళ్లకు గాను 400 MHz స్పెక్ట్రమ్‌ను రూ. 212 కోట్లకు కొనుగోలు చేసింది. వీటిని కమర్షియల్ యాక్టివిటీస్‌ కోసం వాడుకుంటామని కంపెనీ అంటోంది. ఇదే సమయంలో రిలయన్స్ జియో 22 సర్కిల్‌ల కోసం 700 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఎయిర్‌టెల్ 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz మరియు 26 GHz ఫ్రీక్వెన్సీలలో వేలంలో 19867.8 MHz స్పెక్ట్రమ్‌ను రూ.88,078 కోట్లకు కొనుగోలు చేసింది.

Read more about: adani jio vi airtel
English summary

Adani: అదానీకి కేంద్రం నుంచి లైన్ క్లియర్.. త్రిముఖ వ్యూహం.. జియో వేగానికి కళ్లెం తప్పదా..? | Adani's ADNL got full fledged mobile operator license jio, airtel, vi in fear

Adani's ADNL got full fledged mobile operator license jio, airtel, vi in fear
Story first published: Wednesday, October 12, 2022, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X