For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani-Ambai: అంబానీ అదానీలు నిజంగా శత్రువులా..? గౌతమ్ అదానీ సమాధానం ఏంటంటే..

|

Adani-Ambai: కొన్నాళ్లుగా అదానీ వ్యాపార సామ్రాజ్యం తిరుగులేని పురోగతిని కొనసాగిస్తోంది. దీనికి కారణం ప్రధాని మోదీతో ఉన్న పరిచయమేనని వరుస ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కుబేరుడు ఆదానీ. ఇదే సమయంలో అంబానీ అదానీల మధ్య సైతం వ్యాపారాల విషయంలో పోటీ కొనసాగుతూనే ఉంది. ఈ విషయాల్లో అదానీ గ్రూప్ పై దుష్ప్రచారం జరుగుతోందని మీడియా ముఖంగా ఇంటర్వ్యూలో అదానీ పేర్కొన్నారు.

మోదీ సాయం..

మోదీ సాయం..

ఓటీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీతో స్నేహం తన సంపదను పెంచలేదంటూ అదానీ వెల్లడించారు. దీనిపై మరింత స్పష్టతనిచ్చిన అదానీ.. తమ వ్యాపారాలు కేవలం బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే కాక మెుత్తం 22 రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇలా దేశంలో అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం వ్యక్తిగతంలో ప్రధాని మోదీ నుంచి ఎలాంటి సహాయాలను పొందటం లేదని.. దేశ సంక్షేమం దృష్ట్యా ముందుకు సాగుతున్నామని అన్నారు.

అంబానీపై వ్యాఖ్యలు..

అంబానీపై వ్యాఖ్యలు..

దేశాభివృద్ధిలో రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ కీలక పాత్ర పోషించారని అదానీ ప్రశంశించారు. ముఖేష్ అంబానీ తనకు మంచి స్నేహితుడని వెల్లడించారు. అందుకే ఆయనంటే తనకు గౌరవమని తెలిపారు. అంబానీ దేశంలో రిలయన్స్ జియో, రిటైల్, టెక్నాలజీ, ఆయిల్, పెట్రోకెమికల్ వంటి కీలక వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించటాన్ని కొనియాడారు. అంబానీ దేశానికి ముఖ్యమైన పాత్ర పోషించినందుకు గర్విస్తున్నానన్నారు.

అంబానీని దాటుకుంటూ..

అంబానీని దాటుకుంటూ..

ప్రస్తుతం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉండటమే కాక ప్రపంచ కుబేరుల్లో టాప్-5 స్థానంలో నిలిచిన అదానీ తన ఆస్తుల విలువను పెంచుకోవటంతో అంబానీని అధిగమించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే తన తొలి కెరీర్ జర్నీ ప్రారంభమైందన్న అదానీ.. తన వ్యాపార వృద్ధిని ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ ఆపాందించలేనని చెప్పారు.

ధీరూభాయ్ అంబానీ గురించి..?

ధీరూభాయ్ అంబానీ గురించి..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ తనకు అత్యంత స్ఫూర్తినిచ్చారని అంబానీ తన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆయన భారతదేశంలోని వర్ధమాన యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ధీరూభాయ్ అంబానీ కూడా ఎటువంటి మద్దతు లేకుండా ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని ఈ సందర్భంగా తెలిపారు.

Read more about: adani ambani business news
English summary

Adani-Ambai: అంబానీ అదానీలు నిజంగా శత్రువులా..? గౌతమ్ అదానీ సమాధానం ఏంటంటే.. | Adani Revealed His feeling on Reliance Chairman Mukesh Ambani Know details

Adani Revealed His feeling on Reliance Chairman Mukesh Ambani Know details
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X