Adani News: భారీ కంపెనీపై కన్నేసిన అదానీ.. చివరి దశలో మెగా డీల్, ఇన్వెస్టర్లకు అదృష్టం..
Emaar India: అదానీకి 2025 భారీగా కలిసొస్తోంది. ఈ ఏడాది పట్టిందల్లా బంగారంగా మారుతున్న వేళ అదానీ గ్రూప్ పెద్దడీల్ కొట్టడం ద్వారా కుంభస్థలం బద్దలుకొట్టాలని చూస్తున్నారు. దీనికోసం చిన్నాచితకా ప్లాన్లను మానేసి మెగా డీల్ కోసం ప్రయత్నాలు చేయటం మార్కెట్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా అదానీ గ్రూప్ తన రియల్టీ వ్యాపారంపై దృష్టిని కేంద్రీకరించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ఇండియాపై అదానీ రియల్టీ ప్రస్తుతం టార్గెట్ చేసింది. ఈ కంపెనీలో మెజారిటీ వాటాలను దక్కించుకోవటానికి రూ.4,000 నుంచి రూ.5,000 కోట్లను వెచ్చించాలని చూస్తోంది. డీల్ ద్వారా కంపెనీలో 70-100 శాతం వరకు వాటాలను సొంతం చేసుకోనున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. అదానీ నాన్ లిస్టెడ్ కంపెనీ అదానీ రియల్టీ దీనిని మెరుగైన విలువతో కొనుగోలు చేయాలని చూస్తోందని తెలుస్తోంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన డీల్ ప్రకటితం కాలేదు. అయితే డీల్ ఖరారు కావటానికి అత్యంత దగ్గర దశలో చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ డీల్ జరిగితే అదానీ రియల్టీ కిట్టీలో పెద్ద కంపెనీ పడినట్లు అవుతుంది. వాస్తవానికి అదానీ గ్రూప్ రియల్టీ వ్యాపారంలో తన ఫోకస్ కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ క్రమంగా కొనుగోళ్లు చేపడుతోంది. యూఏఈలోని దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్ భారతదేశం దాని గ్లోబల్ మాతృ సంస్థ ఎమ్మార్ గ్రూప్ యాజమాన్యంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఎమ్మార్ ఇండియాని దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ PJSC ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఎత్తైన నిర్మాణం బూర్జ్ ఖలీఫాను నిర్మించిన సంగతి తెలిసిందే. దీని ఎత్తు 828 మీటర్లుగా ఉంది. 2016లో కంపెనీ తన భారతీయ వ్యాపారాన్ని విభజించింది. దీంతో ఎమ్మార్ ఇండియా లిమిటెడ్, ఎంజిఎఫ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ దాని ప్రస్తుత ఆస్తులలో 60.11%, 39.89% వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఎమ్మార్ ఇండియా దిల్లీ-NCR, మొహాలీ, లక్నో, ఇండోర్, జైపూర్‌లలో నివాస, వాణిజ్య స్థలాల కొత్త పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసింది.
అదానీ సోలార్ ఎనర్జీ, పవర్, పోర్ట్స్, ఎయిర్ పోర్ట్స్ వంటి కీలక రంగాల్లో విస్తరణ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఇతర దేశాల్లో కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నారు. అయితే అంతర్జాతీయంగా కొనసాగుతున్న వ్యాపార పరిస్థితుల కారణంగా అదానీ గ్రూప్ ఎదురుగాలులను చూస్తోంది. ఆస్ట్రేలియా బొగ్గు గనుల నుంచి బంగ్లాదేశ్ పవర్ సప్లై వరకు అనేక ఇబ్బందులను సంస్థ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications