Adani News: అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇటీవల కొనసాగిన ఆరోపణ మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల విలువ తిరిగి పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం సైతం క్రమంగా పెరుగటం దీనికి కారణంగా తెలుస్తోంది.
నష్టపరిచే నివేదికల ప్రభావాల నుంచి కోలుకోవడానికి సమ్మేళనం వ్యూహరచనలో పని చేస్తూనే ఉన్నందున అదానీ గ్రూప్ ప్రమోటర్ సంస్థ గ్రూప్‌కి చెందిన రెండు లిస్టెడ్ కంపెనీల్లో తన వాటాను తాజాగా పెంచుకుంది. ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను 69.87% నుంచి 71.93%కి పెంచినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. షేర్లను కెంపాస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ కొనుగోలు చేశాయి. నెల రోజుల వ్యవధిలో వాటాల పెంపు ఇది రెండోసారి.

ఇక అదానీకి చెందిన మరో కీలక కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్. ఇందులో ప్రమోటర్ గ్రూప్ వాటాలను 63.06% నుంచి 65.23%కి పెంచుకున్నట్లు ఫైలింగ్స్ ద్వారా వెల్లడైంది. రిసర్జెంట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల్ దాదాపు 1% వాటాను కొనుగోలు చేయగా.. మరో 1.2% ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ DMCC కొనుగోలు చేసింది. ఇవి రెండూ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు.
అమెరికాకు చెందిన బోటిక్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జిక్యూజి పార్ట్‌నర్స్ అదానీ గ్రూప్ సంస్థల్లో షేర్లను కొనుగోలు చేసిన కొన్ని వారాల వ్యవధిలోనే తాజా చర్యలు వచ్చాయి. ఈ యూఎస్ సంస్థ తన వాటాను అదానీ పోర్ట్స్ కంపెనీలు గత నెలలో 5.03 శాతానికి పెంచుకుంది. సంస్థ ప్రస్తుతం 5 అదానీ గ్రూప్ కంపెనీల్లో తన పెట్టుబడులను కలిగి ఉంది. మెుత్తానికి విదేశీ పెట్టుబడులు, ప్రమోటర్ గ్రూప్ పెట్టుబడులు పెరగటం ఇన్వెస్టర్లకు సంతోషాన్ని కలిగించటంతో నష్టాల నుంచి అదానీ స్టాక్స్ కోలుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications