Adani Power: అదానీ పవర్ లిమిటెడ్ దేశంలోని జార్ఖండ్ గొడ్డాలో తన మొదటి 800 MW అల్ట్రా-సూపర్-క్రిటికల్ థర్మల్ పవర్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభిస్తోంది. అయితే ఇక్కడ ఉత్పత్తి అయ్యే 748 మెగావాట్ల విద్యుత్ ను బంగ్లాదేశ్ కు పంపిణీ ప్రారంభించింది.
అదానీ పవర్ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయటం బంగ్లాదేశ్ కు ఆర్థికంగా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఖరీదైన ద్రవ ఇంధనం ద్వారా విద్యుత్తును తయారు చేస్తోంది. గొడ్డా నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ ఆ దేశ ఖర్చులను భారీగా తగ్గించేందుకు దోహదపడుతోందని తెలుస్తోంది. గొడ్డా పవర్ ప్లాంట్ భారత్-బంగ్లాదేశ్ మధ్య దీర్ఘకాల బంధంలో ఒక వ్యూహాత్మక ఆస్తి" అని అదానీ పవర్ లిమిటెడ్ CEO SB ఖలియా పేర్కొన్నారు.

అదానీ ప్లాంట్ బంగ్లాదేశ్‌లో విద్యుత్ సరఫరాను సులభతరం చేస్తూ అక్కడి పరిశ్రమలకు దోహదపడనుంది. అదానీ థర్మల్ ప్లాంట్ ప్రపంచంలో అత్యుత్తమ తరగతిలో ఒకటి. పైగా దేశంలో 100% ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (FGD), సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (SCR), జీరో వాటర్ డిశ్చార్జ్ కలిగిన మెుదటి పవర్ ప్లాంట్ కావటం విశేషం. జార్ఖండ్‌లో 10,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అదానీ గ్రూప్ ప్రణాళికలో ఈ పవర్ ప్లాంట్ ఒక భాగంగా ఉంది.
నవంబర్ 2017లో బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ 1600 మెగావాట్ల అల్ట్రా-సూపర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి 1,496 MW నికర కెపాసిటీ పవర్‌ను సేకరించేందుకు అదానీ పవర్ అనుబంధ సంస్థ అదానీ పవర్ జార్ఖండ్ లిమిటెడ్ (APJL)తో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం హెవీ ఫ్యూయల్ ఆయిల్ (HFO), హై-స్పీడ్ డీజిల్ (HSD) ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని చేపడుతోంది. దీని కారణంగా అక్కడ విద్యుత్ టారిఫ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో గొడ్డా నుంచి వచ్చే విద్యుత్ మూడో వంతు ధరకు లభించటంతో.. ఇది బంగ్లాదేశ్‌కు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న విద్యుత్ వనరుగా మారింది.


Click it and Unblock the Notifications