Adani News: నష్టాలతో మొదలై లాభాల్లో ముగిసిన అదానీ స్టాక్.. సడన్ ఛేంజ్‌కు కారణమిదే..
Adani Power: ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల బాటలో కొనసాగిన అదానీ పవర్ ఒక్కసారిగా గ్రీన్ లో ముగిసింది. అంతేకాకుండా 3.5 శాతానికి పైగా బుల్ రన్ కొనసాగించింది. ఆ కంపెనీ చేసిన ఓ కీలక ప్రకటన ఇందుకు కారణంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం, భారతదేశం పవర్ గ్రిడ్ విషయంలో తీసుకున్న నిర్ణయం వెరసి ఆ స్టాక్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈరోజు ఇచ్చిన క్లారిటీతో వాటన్నిటికీ తెర దింపినట్లు అయింది.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులతో సంబంధం లేకుండా ఆ దేశంతో ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు అదాని గ్రూప్ స్పష్టం చేసింది. ఆ దేశానికి విద్యుత్ సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తనివ్వబోమని పేర్కొంది. ఇటీవల భారత ప్రభుత్వం ఈ రంగంలో చేసిన నిబంధనల మార్పు తమ ఒప్పందంపై ఎటువంటి ప్రభావం చూపబోదని వెల్లడించింది. దీంతో అదానీ పవర్ నష్టాల నుంచి తేరుకుని తిరిగి గ్రీన్ లోకి వచ్చింది.

ఝార్ఖండ్ రాష్ట్రంలో అదానీ పవర్ కు సంబంధించిన గొడ్డ పవర్ ప్లాంట్ 100 శాతం విద్యుత్‌ను పొరుగు దేశానికి ఎగుమతి చేసే ఒప్పందంలో ఉంది. రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో తలెత్తిన అల్లర్లు కాస్తా ప్రధాని దేశం వదిలి పారిపోవాల్సిన స్థితికి చేరాయి. ఇదే సమయంలో భారత్ గ్రిడ్ కు సంబంధించి ప్రభుత్వం చేసిన నిబంధనల మార్పు కూడా తోడవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది . దీంతో మార్కెట్లలో భారీ ర్యాలీ ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు అదానీ పవర్ స్టాక్ మాత్రం నష్టాల్లో కొనసాగుతూ వచ్చింది.
ఇక ఇటీవల హిండెన్‌బర్గ్ రిలీజ్ చేసిన నివేదిక కూడా కొంతమేర అదానీ గ్రూప్ షేర్లు ఒత్తిడికి లోనుకావడానికి కారణమయ్యింది. అయితే అదాని ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ MSCI ఇండెక్స్‌లోకి తిరిగి ప్రవేశించనుందన్న వార్తలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఈ నెలాఖరులోగా కంపెనీలోకి భారీగా పెట్టుబడులు వచ్చి చేరతాయని అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ వెరసి అదానీ గ్రూప్ షేర్లు తిరిగి కోలుకోవడానికి కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications