Adani News: రేసుగుర్రం లా దూసుకుపోతున్న అదానీ పవర్ స్టాక్.. ఎందుకంటే..?
Adani Power: అదానీ కష్టం ఫలిస్తోంది. ప్రస్తుతం ఆయన కన్నేసిన దివాలా తీసిన కంపెనీని కొనేందుకు అధికారిక అనుమతులు లభించాయి. దీంతో ఇన్వెస్టర్లలో కోలాహలం కారణంగా నేడు అదానీ పవర్ షేర్లలో భారీ బూమ్ కనిపించింది.
తాజాగా ల్యాంకో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ కంపెనీ CCI నుంచి ఆమోదం పొందింది. దీంతో నేడు అదానీ పవర్ షేర్లు నేడు ఇంట్రాడేలో పెరుగుతున్నాయి. నేడు ప్రారంభ ట్రేడింగ్‌లోనే షేరు దాదాపు 4 శాతం పెరిగి రూ.543కి చేరుకుంది. ఉదయం రూ.529 వద్ద ప్రారంభమై కొద్ది నిమిషాల్లోనే రూ.538.80కి చేరింది. అదానీ పవర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.589.45, కనిష్ఠ ధర రూ.166.40గా ఉంది.

అదానీ పవర్ షేర్ ధర గత ఐదు రోజుల్లో 5 శాతానికి పైగా పెరిగింది. గత నెలలో ప్రతికూల రాబడులను ఇస్తున్న అదానీ గ్రూప్‌కు చెందిన ఈ స్టాక్ గత ఆరు నెలల్లో 43 శాతానికి పైగా అద్భుతమైన రాబడిని ఇచ్చింది. షేర్ ఏడాది పనితీరును గమనిస్తే.. ఇన్వెస్టర్ల సొమ్ము దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 194 శాతం జంప్ నమోదైంది.
ల్యాంకో అమర్‌కంటక్ పవర్ దివాలా ప్రక్రియను కొనసాగిస్తోంది. లాంకో గ్రూప్‌లో కొంత భాగం భారతదేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంలో ఉంది. అదానీ పవర్ లిమిటెడ్ ల్యాంకో అమర్‌కంటక్ పవర్ 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను కొనుగోలు చేస్తుంది. CCI ప్రకారం ప్రతిపాదిత లావాదేవీ భారతదేశంలోని సంభావ్య సంబంధిత మార్కెట్‌లో పోటీపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. అంతకుముందు అదానీ పవర్ దివాలా తీసిన ల్యాంకో అమర్‌కంటక్ పవర్ కొనుగోలు కోసం పరిష్కార ప్రణాళిక కోసం రుణదాతల కమిటీ ఆమోదం పొందింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీకి రూ.4,101 కోట్ల విలువైన బిడ్‌ను అదానీ పవర్ గెలుచుకున్నట్లు సమాచారం. ల్యాంకో అమర్‌కంటక్‌లో చత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కటి 300-300 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ యూనిట్లు ఉన్నాయి. ఈ డీల్ అదానీ పవర్ సామర్థ్యాన్ని విస్తరిస్తుంది.


Click it and Unblock the Notifications