Adani News: అద్భుత రాబడినిచ్చిన అదానీ స్టాక్.. ర్యాలీ ఇంకా కొనసాగుతుందా..??
Gautam Adani: అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ దాడి స్టాక్ మార్కెట్ల చరిత్రలో అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. గత ఏడాది జనవరి మాసంలో వచ్చిన ఈ రిపోర్ట్ పెద్ద కల్లోలానికి కారణమైన సంగతి తెలిసిందే.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ లోని అదానీ పవర్ స్టాక్ ధర రూ.132.40 స్థాయికి పడిపోయింది. అయితే ఇప్పుడు కనిష్ఠ స్థాయి నుంచి 4 రెట్ల కంటే ఎక్కువ రిటర్న్స్ తన ఇన్వెస్టర్లకు అందించింది. గత ఏడాది కాలంలో స్టాక్ దాదాపు 240% పెరిగింది. అయితే నేడు అదానీ పవర్ రూ.546.50 వద్ద ప్రారంభమై రూ.555.50కి చేరుకోగా.. స్టా 52 వారాల గరిష్ఠ ధర రూ.589.45గా ఉంది.

గత ఏడాది పతనం తర్వాత కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్న తీరును పరిశీలిస్తే.. గడచిన ఆరు నెలల్లో అదానీ పవర్ 58 శాతానికి పైగా లాభపడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5.42 శాతం మాత్రమే లాభపడినప్పటికీ.. గత మూడు నెలల్లో 42 శాతం జంప్ నమోదైంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు సైతం కంపెనీ నుంచి 5 ఏళ్ల కాలంలో ఏకంగా 1284 శాతం భారీ రాబడిని అందుకున్నారు. స్టాక్ టెక్నికల్స్ పరిశీలిస్తే.. అదానీ పవర్ దీర్ఘకాలికంగా బుల్లిష్‌గా ఉంది. అయితే స్వల్ప కాలంలో స్టాక్ బేరిష్ మెుమెంటం చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని కలిగి ఉండటం ఉత్తమమైనదిగా వారు సూచిస్తున్నారు.
అదానీ పవర్ కంపెనీ బలాబలాలను పరిశీలిస్తే.. అదానీ పవర్ బలం స్కోర్ 14, బలహీనత స్కోరు 9, అవకాశాల స్కోర్ 10గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కంపెనీ షేర్ల 30 రోజుల SMA 200 రోజుల SMAని దాటుతోంది. ప్రస్తుత ధర బహిరంగ ధర కంటే ఎక్కువగా ఉంది. 52 వారాల కనిష్టం నుంచి అత్యధిక రికవరీ, స్టాక్ మంచి వాల్యూమ్‌లతో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కేవలం ఒక విషయం మాత్రమే స్టాక్‌కు ప్రమాదాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం అదానీ పవర్ అధిక మార్కెట్ క్యాప్, తక్కువ పబ్లిక్ హోల్డింగ్ ఉన్న కంపెనీగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications