Adani Power: గౌతమ్ ఆదానికి చెందిన కంపెనీల్లో చాలా మంది రిటైలర్లను ఆకర్షించిన స్టాక్ అదానీ పవర్. దీని ధర కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే ఊహించని స్థాయిలకు ఎగబాకింది. రానున్న కాలంలో పవర్ రంగం చాలా కీలక ఇంధనంగా మారుతున్న తరుణంలో కంపెనీ మంచి పనితీరును కనబరుస్తోంది. ఇదే రంగంలోని టాటా పవర్ సైతం ఇటీవల క్యూ-2లో మంచి లాభాలను నమోదు చేసింది.

భారీగా లాభాలు..
సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో అదానీ పవర్ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 201.6% పెరిగింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ రూ.695.53 లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.230.6 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

అందుకే పెరుగుదల..
మెరుగైన టారిఫ్ రియలైజేషన్, అత్యధిక వన్-టైమ్ ఆదాయం రూ. 771 కోట్ల నేపథ్యంలో అదానీ పవర్ ఏకీకృత రెవెన్యూ ఏడాది ప్రాతిపధికన 36% పెరిగి 7,044 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 51.5 శాతం పెరిగి రూ.8,446 కోట్లకు చేరుకుంది. EBITDA సై తం 51 శాతం పెరిగి రూ.2,350 కోట్లకు పెరిగింది.

ఇంధన అవసరాలు..
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు మద్ధతుగా నిలుస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా అన్నారు. కమ్యూనిటీల అభివృద్ధికి భరోసానిస్తూ స్థిరమైన, విశ్వసనీయమైన, సరసమైన విద్యుత్ సరఫరాను అందించడానికి అదానీ పవర్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలను తాము కొనసాగిస్తామని వెల్లడించారు.

ఇన్వెస్టర్ల పరిస్థితి..
1996లో ప్రారంభమైన అదానీ పవర్ కంపెనీ స్టాక్ ప్రస్తుతం రూ.357 వద్ద ఉంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి షేర్ 4 శాతం మేర నష్టపోయింది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.93.60 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.432.50 గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.39 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కిందట రూ.101.30 వద్ద ఉన్న స్టాక్ విలువ 252.42 శాతం పెరిగి ప్రస్తుతం రూ.357 వద్ద ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications