Adani Power: లాభాలతో పిచ్చెక్కించిన అదానీ పవర్.. 850 శాతం పెరిగిన నికర లాభం..
Adani Power Q2 Results: ఇటీవల వరుసగా అదానీ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈక్రమంలో అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలు ఇన్వెస్టర్లను కొంత మేర నిరాశకు గురిచేశాయి.
అయితే తాజాగా అదానీ పవర్ ఫలితాలు గురువారం విడదల అయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ మంచి పనితీరును కనబరిచింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అదానీ పవర్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 848 శాతం పెరిగి రూ.6,594.17 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభాలు కేవలం రూ.695.33 కోట్లుగా ఉన్నాయి.

అలాగే క్యూ2లో కంపెనీ ఆదాయం 84 శాతం పెరిగి రూ.12,990 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇది రూ.7,044 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఫలితాల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో EBITDA రూ.948 కోట్ల నుంచి రూ.5,170 కోట్లకు పెరిగింది. అయితే EBITDA మార్జిన్ గత ఆర్థిక సంవత్సరం సంబంధిత త్రైమాసికంలో 13.5% నుంచి 39.8%కి మెరుగుపడింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక కాలానికి కంపెనీ రూ.1,371 కోట్ల పన్ను క్రెడిట్‌ని కేంద్రం నుంచి పొందింది.
మెరుగైన విద్యుత్ డిమాండ్, అధిక నిర్వహణ సామర్థ్యం కారణంగా Q2FY23లో ఏకీకృత విద్యుత్ విక్రయాల పరిమాణం 18.1 బిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. ఎక్కువ అమ్మకాల వాల్యూమ్ కారణంగా త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నిరంతర మొత్తం ఆదాయం 61% పెరిగి రూ. 7,534 కోట్ల నుంచి రూ.12,155 కోట్లకు చేరుకుంది. అదానీ పవర్ ఇప్పుడు స్థిరమైన నగదు ప్రవాహాలు, సురక్షితమైన ఆదాయ ప్రవాహాన్ని కలిగి ఉన్నట్లు సీఈవో ఎస్‌బి ఖ్యాలియా వెల్లడించారు. కంపెనీ భారతదేశపు అత్యంత విశ్వసనీయ, పోటీతత్వ విద్యుత్ జనరేటర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. ఫలితాల నేపథ్యంలో స్టాక్ ఎన్ఎస్ఈలో 3 గంటల సమయంలో రూ.894.55 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications