For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: పవర్ ఫుల్ ర్యాలీలో అదానీ స్టాక్.. ఒక్క నెలలో 41% రాబడి .. మీ దగ్గర కూడా షేర్ ఉందా..

|

Adani Stock: శరవేగంగా అదానీ కొత్త వ్యాపారాల్లోకి తన వ్యాపారాలను విస్తరింస్తున్నారు. అదానీ మాదిరిగిగానే ఆయనకు చెందిన కొన్ని స్టాక్స్ కూడా పరుగులు తీస్తున్నాయి. అవి తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి. తాజాగా ర్యాలీలో ఉన్న ఈ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

స్టాక్ పరుగులు..

స్టాక్ పరుగులు..

వ్యాపార రంగంలో ప్రస్తుతం గౌతమ్ అదానీ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఆయనకు చెందిన అదానీ పవర్ షేర్లు స్టాక్ మార్కెట్లో పరుగులు తీస్తున్నాయి. ఈ తరుణంలో స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ స్టాక్ మాత్రం పాజిటివ్ గానే ఉంది. ఎన్‌ఎస్‌ఈలో సాయంత్రం 2.48 గంటలకు కంపెనీ షేర్లు 3.28% లాభంతో రూ.417.85 వద్ద ట్రేడవుతోంది.షేర్ ధరలో భారీ ర్యాలీ తర్వాత.. మార్కెట్ క్యాప్ పరంగా అదానీ పవర్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ యుటిలిటీస్ కంపెనీ NTPCని అధిగమించింది.

 భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్..

భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్..

అదానీ పవర్ కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పెరుగుదల కారణంగా ప్రస్తుతం రూ.1,60,4291 కోట్లకు చేరుకుంది. మార్కెట్ క్యాప్‌తో కంపెనీ 35వ స్థానంలో నిలవగా.. NTPC రూ.1,54,710 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో 37వ స్థానంలో ఉంది. బీఎస్ఈ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ స్టాక్ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (M&M)ని అధిగమించింది.

ఈ ఏడాది 308.34% రాబడి..

ఈ ఏడాది 308.34% రాబడి..

గత నెలలో NTPC మార్కెట్ ధరలో 6 శాతం పెరిగిగా.. అదానీ పవర్ షేరు ధర 41 శాతం రాబడిని అందించింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 10 శాతం మాత్రమే పెరిగింది. ఇప్పటివరకు 2022 క్యాలెండర్ సంవత్సరంలో NTPC కంటే అదానీ పవర్ 308.34% రాబడిని ఇచ్చింది. అదానీ పవర్ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.70.35 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.418.85 వద్ద ఉంది. ప్రస్తుతం స్టాక్ తన 52 వారాల గరిష్ఠానికి దగ్గరగా ట్రేడ్ అవుతోంది.

English summary

Multibagger Stock: పవర్ ఫుల్ ర్యాలీలో అదానీ స్టాక్.. ఒక్క నెలలో 41% రాబడి .. మీ దగ్గర కూడా షేర్ ఉందా.. | Adani Power Ltd stock ralleying to new highs amid market volatalities gave multibagger returns

this adani stock gave multibagger returns to its investors
Story first published: Friday, August 19, 2022, 15:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X