'అదానీ పవర్' 1,320MW థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు మధ్యప్రదేశ్ ఒకే
మధ్యప్రదేశ్‌లో 1,320 మెగావాట్ల (MW) థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం తెలిపినట్లు అదానీ పవర్ తెలిపింది. అదానీ పవర్‌కు చెందిన పెంచ్ థర్మల్ ఎనర్జీ (అంతకుముందు అదానీ పెంచ్ పవర్) ప్లాంట్ ద్వారా మొత్తం విద్యుత్‌ను విక్రయించేందుకు కూడా కమిషన్ ఆమోదం లభిచింది.
పెంచ్ థర్మల్ ఎనర్జీ-మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (MPPMCL) మధ్య పవర్ పర్చేంజ్ అగ్రిమెంట్ జరిగింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన 1,320 మెగావాట్ల విద్యుత్ సేకరణ కోసం ఈ ఒప్పందం జరిగింది.

శక్తి పాలసీ ప్రకారం కేటాయించిన బొగ్గు ద్వారా ఇంధనాన్ని సోర్సింగ్ చేయడం ద్వారా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్, ఆపరేట్ (DBFOO) ప్రాతిపదికన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏర్పాటు చేయనున్న 1,320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త విద్యుత్ కేంద్రం నుండి సరఫరా చేస్తారు.
ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ డెవలప్‌మెంట్ విద్యుత్ రంగం దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యంపై సంస్థ నమ్మకాన్ని ధృవీకరిస్తోందని పేర్కొంది.


Click it and Unblock the Notifications