Adani News: అదానీ ప్లేట్ పిరాయిస్తారా.. ఆ స్టాక్ ఇన్వెస్టర్లకు వార్నింగ్ ప్రభావం..
Adani Power: దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి అదానీ గ్రూప్. దీనిని నడిపిస్తున్న గౌతమ్ అదానీ దేశంలోనే కాక పొరుగుదేశాల్లో సైతం తన వ్యాపారాలను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ విద్యుత్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతవారం తాము విద్యుత్ సరఫరా నిలపబోమని హామీ ఇచ్చిన గ్రూప్ తాజాగా అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. బంగ్లా ప్రభుత్వం నుంచి రావాల్సిన 500 మిలియన్ డాలర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ క్రమంలో అదానీ బృందం సూచించింది. బంగ్లాదేశ్ విద్యుత్ బడ్జెట్ 3.7 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో అదానీకి చెల్లించాల్సిన బకాయి మొత్తం 492 మిలియన్ డాలర్లు మాత్రమేనని తెలుస్తోంది.

ఈ వ్యవహారం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పాలన మార్పుతో ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, వాణిజ్య మందగమనం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదానీ తనకు రావాల్సిన విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరటం అక్కడి ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ప్రస్తుతం అదానీ పవర్ కంపెనీ తన 1,600 మెగావాట్ల కోడా బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో అదానీ గ్రూప్, బంగ్లాదేశ్ విద్యుత్ బోర్డుకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం సరఫరా కొనసాగుతోంది.
అయితే ప్రస్తుతం ఉన్న మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో ఒప్పందం ఖర్చుతో కూడుకున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అని చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. దీని కారణంగా ఈ 500 మిలియన్ డాలర్ల బకాయిలు అందుకోవడంలో అస్థిరత ఏర్పడిందని అదానీ పవర్ తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వ మధ్యంతర పరిపాలనతో చర్చలు కొనసాగుతున్నాయి. మొండి బకాయిల సమస్య బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తోందని అదానీ గ్రూప్ పేర్కొంది. బంగ్లా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి సహాయం కోరుతున్న వేళ అదానీ చెల్లింపులు నిజంగా పెద్ద భారంగా మారాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం మునుపటి ఇంధన ఒప్పందాలను సమీక్షించాలని యోచిస్తోంది. అయితే ఈ పరిణామాల ప్రభావం అదానీ పవర్ షేర్లపై ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications