Adani News: ఆ కంపెనీపై కన్నేసిన అదానీ గ్రూప్.. దివాలా ప్రక్రియలో సొంతం..
Adani Group: గౌతమ్ అదానీ దాదాపు ఏడాది తర్వాత తిరిగి కొనుగోళ్ల దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా దివాలా తీసిన కంపెనీలపై కన్నేసి కొనుగోలు చేసే ప్రక్రియను అదానీ వేగవంతం చేశారు.
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం అదానీ గ్రూప్ దివాలా తీసిన విద్యుత్ కంపెనీని కొనుగోలు చేయబోతోంది. అదానీ గ్రూప్ సంస్థ అదానీ పవర్.. దివాలా ప్రక్రియలో ఉన్న ల్యాంకో అమర్‌కంటక్ పవర్‌ను కొనుగోలు చేయడానికి రుణదాతల ఆమోదం పొందింది. వాస్తవానికి ల్యాంకో అమర్‌కంటక్ పవర్ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో 300 మెగావాట్ల థర్మల్ పవర్ రెండు యూనిట్లను నిర్వహిస్తోంది. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని దూకుడుగా విస్తరించాలని అదానీ యోచిస్తున్నారు. దివాలా పరిష్కార ప్రక్రియ కింద కంపెనీ కొనుగోలు కోసం అదానీ పవర్ ఎంత మొత్తం బిడ్ చేసింది అనేది వెల్లడించలేదు.

దివాలా తీసిన ల్యాంకో అమర్‌కంటక్ పవర్‌ను కొనుగోలు చేసే రిజల్యూషన్ ప్లాన్‌కు అదానీ పవర్ రుణదాతల ఆమోదం పొందిందని కంపెనీ మంగళవారం ప్రకటించింది. అదానీ పవర్ సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్‌ను ల్యాంకో అమర్‌కంటక్ పవర్ క్రెడిటర్స్ కమిటీ ఆమోదించిందని అందులో పేర్కొంది. ల్యాంకో యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు కంపెనీ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందుకుంది. 2019లో రిజల్యూషన్ ప్రక్రియ కోసం ఆస్తులను మదట ఆమోదించినట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దివాలా మార్గంలో అదానీ పవర్ కొత్త కొనుగోలు చేయడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్‌లో కోస్టల్ ఎనర్జీకి చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ నుంచి రూ.3,450 కోట్ల బిడ్‌కు అదానీ పవర్ కన్సార్టియం ఎల్‌వోఐని పొందిన సంగతి తెలిసిందే. ఇది తమిళనాడులో 600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిర్వహిస్తోంది. దేశంలో రానున్న కాలంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్న వేళ అదానీ గ్రూప్ పవర్ రంగంలో కొత్త కొనుగోళ్లను కొనసాగిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications