దివాలా తీసిన కంపెనీని రూ.4 వేల కోట్లకు కొనుగోలు చేసిన అదానీ, ట్విస్ట్ దెబ్బకు అందరికీ ఫ్యూజులు అవుట్..

భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారు అదానీ పవర్ లిమిటెడ్ (APL) తాజాగా మరో మైలురాయిని సాధించింది. మహారాష్ట్రలోని విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (VIPL) రూ. 4 వేల కోట్లకు కొనుగోలు చేసింది. నాగ్‌పూర్ సమీపంలోని బుటిబోరిలో ఉన్న ఈ ప్లాంట్‌లో రెండు 300 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ యూనిట్లు ఉన్నాయి. ఈ భారీ డీల్ తో అదానీ పవర్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 18,150 మెగావాట్లకు పెరిగింది. దీని ద్వారా 2030 నాటికి 30,670 మెగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంగా అదానీ గ్రూపు అడుగులు వేస్తోంది.

విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ అనేది నాగ్‌పూర్ జిల్లా బుటిబోరిలో ఉన్న 2×300 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్. ఇది గతంలో ఇన్సాల్వెన్సీ & బ్యాంక్‌రప్సీ కోడ్ (IBC) కింద దివాలా ప్రక్రియలో ఉంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా అదానీ పరిష్కారాన్ని సూచించింది. ఈ పరిష్కార మార్గాన్ని ముంబై NCLT జూన్ 18, 2025న ఆమోదించింది. అనంతరం జూలై 7, 2025న ఈ డీల్ పూర్తి చేశారు.

Adani Power Vidarbha Power Plant 600 MW unit Adani Power capacity Indian energy sector thermal power plant Adani electricity production power infrastructure India Adani Group news electricity generation India power plant commissioning energy news India 600 Goutham Adani

ఈ కొనుగోలుతో అదానీ పవర్ దాని బేస్ లోడ్ పవర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి మరిన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కంపెనీ 1,600 మెగావాట్ల సామర్థ్యం గల 6 అల్ట్రా సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మిస్తోంది. మధ్యప్రదేశ్ (సింగ్రౌలి-మహాన్),ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్, రాయ్‌గఢ్, కోర్బా),రాజస్థాన్ (కావా),ఉత్తర ప్రదేశ్ (మిర్జాపూర్)లలో పనులు జరుగుతున్నాయి. దీనికి అదనంగా కోర్బాలో ఉన్న 1,320 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా పునఃప్రారంభించేందుకు అదానీ పవర్ సిద్ధమైంది.

దీనిపై అదానీ పవర్ CEO ఎస్.బి. ఖ్యాలియా మాట్లాడుతూ.. దివాళాలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని లాభదాయకంగా మార్చడం మా వ్యూహం.దేశంలో 'అందరికీ విద్యుత్' కలను సాకారం చేయడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అదానీ పవర్.. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడుల్లో తమ థర్మల్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. అలాగే గుజరాత్‌లో 40 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను కూడా నిర్వహిస్తోంది.ఈ తాజా డీల్ తో అదానీ గ్రూప్ భారత విద్యుత్ రంగంలో తమ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+