Adani Group: ఆ కంపెనీపై కన్నేసిన అదానీ.. కొనేందుకు వరుసగా బిడ్స్ దాఖలు..
Gautam Adani: స్టాక్ మార్కెట్లో అదానీ షేర్ల మాదిరిగానే ప్రస్తుతం గౌతమ్ అదానీ కూడా దూసుకుపోతున్నారు. అదానీ పవర్ వ్యాపారాన్ని వేగవంతం చేసేందుకు కొత్త అవకాశాలను అస్సలు మిస్ కాకుండా ఒడిసిపడుతున్నారు.
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మరో కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి అదానీ కన్నేసి కంపెనీ నష్టాలతో దివాలా తీసిన ల్యాంకో అమర్‌కంటక్ పవర్. ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఏకంగా రుణదాతలకు రూ.4,100 కోట్లను ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి థర్మల్ పవర్ కంపెనీ ల్యాంకో అమర్‌కంటక్ పవర్ ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉంది.

గడచిన ఆరు వారాల్లో అదానీ పవర్ ఈ కంపెనీని చేజిక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సమస్యాత్మక కంపెనీ ల్యాంకో అమర్‌కాంతర్ పవర్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలోనే గతంలో దాఖలు చేసిన బిడ్లలో కొనుగోలుకు రూ.3,650 కోట్లను కోట్ చేసింది. అయితే తాజాగా దీనిని సవరిస్తూ రెండోసారి దాఖలు చేసిన బిడ్లలో ఏకంగా రూ.4,100 కోట్లను చెల్లించాలని నిర్ణయిస్తూ రివైజ్డ్ బిడ్ దాఖలు చేసింది.
ల్యాంకో అమర్‌కంటక్‌ను కొనుగోలు చేయడానికి పెద్ద ఆటగాళ్లు రేసులోకి దిగారు. ఇందులో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉండటం గమనార్హం. కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,103 కోట్లు ఆఫర్ చేయగా.. పీఎఫ్‌సీ నేతృత్వంలోని గ్రూప్ రూ.3,020 కోట్లు బిడ్ చేసింది. దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా-చంపా హైవే సమీపంలో బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టు ప్రస్తుత సామర్థ్యం 600 మెగావాట్లు. అదానీ పవర్‌కు ఇది వ్యూహాత్మకంగా ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
గడచిన 6 నెలల్లో అదానీ పవర్ షేర్లు 90% కంటే ఎక్కువ లాభపడ్డాయి. కంపెనీ షేర్లు 12 జూన్ 2023న రూ.271.60 వద్ద ఉండగా.. నేడు మధ్యాహ్నం 2.38 గంటల సమయంలో రూ.515.50గా ఉంది. గత నెలలో అదానీ పవర్ స్టాక్ ఏకంగా 33 శాతం లాభాన్ని తన ఇన్వెస్టర్లకు అందించింది.


Click it and Unblock the Notifications