Adani Power: భారతదేశంలోని అగ్ర వ్యాపారవేత్తల్లో ఒరుగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ 2024లో తన షాపింగ్ కొనసాగిస్తున్నారు. పవర్, సిమెంట్ రంగాలంపై ఈ ఏడాది భారీగా దృష్టి సారించిన అదానీ గ్రూప్ మరిన్ని కంపెనీలను అదానీ గ్రూప్ కిందకు తీసుకొస్తూ తన ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
తాజాగా అదానీ పవర్ కెఎస్‌కె మహానది థర్మల్ పవర్ ప్రాజెక్టును (KSK Mahanadi Power) చేజిక్కించుకునేందుకు టాప్ బిడ్డర్‌గా నిలిచారు. ఈ క్రమంలో దివాలా ప్రక్రియలో కొనసాగుతున్న కంపెనీ నుంచి 1800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ దక్కించుకునేందుకు ఏకంగా రూ.27,000 కోట్లతో అత్యధిక బిడ్ దాఖలు చేసింది. అయితే ప్రస్తుతం కంపెనీ మెుత్తం అప్పులు రూ.32,240 కోట్లుగా ఉన్నాయి. ఈ లెక్కన అదానీ ఆఫర్ చేస్తున్న బిడ్ మెుత్తం ద్వారా దాదాపు 92 శాతం మంది రుణదాతలు తమ అప్పులను తిరిగి పొందేందుకు అవకాశం లభించనుంది.

ఈ క్రమంలో అదానీ పవర్ కంపెనీ షేర్లు శుక్రవారం ముగింపు నాటికి స్వల్పంగా నష్టంతో రూ.726.40 వద్ద క్లోజ్ అయ్యాయి. గడచిన ఆరు నెలల కాలంలో అదానీ పవర్ స్టాక్ ధర 33 శాతం పెరుగుదలను చూసింది. KSK Mahanadi Power కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు 10 మంది వేలంలో పాల్గొంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అదానీ పవర్‌తో పాటుగా పోటీలో కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్, కోల్ ఇండియా, NTPC, వేదాంత, JSW ఎనర్జీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఐల్యాబ్ ఇండియా స్పెషల్ ఫండ్, రష్మీ మెటాలిక్స్, శ్రీషా హోల్డింగ్స్ పోటీలో ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కెఎస్‌కె మహానది పవర్ కంపెనీ కొనుగోలు కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ NTPC బిడ్ వేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కంపెనీ విలువను ప్రభుత్వం రూ.5,000 కోట్లుగా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం అదానీ పవర్ గతంలో అంచనావేసిన ధరకు 5 రెట్లు ఎక్కువ చెల్లించేందుకు ముందుకొచ్చింది. అదానీ గ్రూప్ ఈ బిడ్ ద్వారా ఛత్తీస్‌గఢ్ జంజ్‌గిర్ చంపా జిల్లాలో ఉన్న కెఎస్‌కె మహానది పవర్ ప్లాంట్ ఏప్రిల్ 2022 నుండి కార్పొరేట్ దివాలా ప్రక్రియను అమలు చేస్తోంది. కంపెనీ మార్చి 2018లో డిఫాల్ట్ కావటంతో రూ.21,760 కోట్ల అప్పులతో దివాలా ప్రక్రియను ఎదుర్కొంటోంది. KSK మహానది 40 GWని మార్చి 2018లో ప్రత్యేక పార్లమెంటరీ ప్యానెల్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్‌గా గుర్తించింది.


Click it and Unblock the Notifications