Bangladesh News: భారత బిలియనీర్ గౌతమ్ అదానీ సంస్థ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌తో వాణిజ్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలోనూ అదానీ గ్రూప్ అండగా ఉంటుందని కీలక ప్రకటన వెలువరించింది.
అదానీ పవర్ సంస్థ బంగ్లాదేశ్ కు విద్యుత్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ దేశం నుంచి రావాల్సిన చెల్లింపు బకాయిలు దాదాపు 800 మిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ నిరంతరాయంగా సరఫరా కొనసాగిస్తామని అదానీ గ్రూప్ హామీ ఇచ్చిందని వెల్లడైంది. అయితే బకాయిల చెల్లింపులను వేగవంతం చేయాలని అదానీ పవర్ బృందం ప్రస్తుత బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ క్రమంలో ప్లాంట్‌ను నిర్మించడంలో చేసిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి రుణదాతల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు గ్రూప్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది.

ఈ క్రమంలో ఆలస్యం కారణంగా వచ్చే వడ్డీతో పాటు చెల్లింపులు త్వరలో క్లియర్ అవుతాయని అదానీ గ్రూప్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి అదానీ గ్రూప్ జార్ఖండ్‌లోని అదానీ పవర్ 1,600 మెగావాట్ల గొడ్డ ప్లాంట్ బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్(BPDB)తో 100 శాతం సరఫరా ఒప్పందాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీని నుంచి సగటున నెలవారీ 90 నుంచి 100 మిలియన్ డాలర్లు విలువైన విద్యుత్ పంపిణీ కొనసాగుతోంది. కంపెనీ గతంలో అధికారంలో ఉన్న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో గొడ్డ ప్లాంట్ నుంచి 1,496 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి నవంబర్ 2017లో బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
అదానీ నేతృత్వంలో కొనసాగుతున్న గొడ్డ పవర్ ప్లాంట్ దాదాపు 2 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేయబడింది. ఇది ఇండియాలో మొట్టమొదటి కమీషన్డ్ ట్రాన్స్‌నేషనల్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌లో 100 శాతం మరొక దేశానికి సరఫరా చేయబడుతోంది. అదానీ పవర్ ఈ ప్లాంటులో జూన్ 2023 నుంచి ఉత్పత్తిని ప్రారంభించి బంగ్లాదేశ్‌కు నిరంతరాయంగా సరఫరాను కొనసాగిస్తోంది. విద్యుత్ సరఫరాతో పాటు, అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌లో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీస్, రైస్ ప్యాకేజింగ్ యూనిట్లను కూడా నిర్వహిస్తోంది.
బంగ్లాదేశ్ యుటిలిటీకి గత ప్రభుత్వంలో వచ్చిన బకాయిలు దాదాపు $400 మిలియన్లుగా ఉన్నాయని అదానీ పవర్‌లో రెగ్యులేటరీ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ హెడ్ శైలేష్ సావా మే 2, 2024న వెల్లడించారు. ఆగస్ట్ 5న భారత ప్రభుత్వం తమ విద్యుత్ ఎగుమతి చేసే ఎనర్జీ ఉత్పత్తిదారుల కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆఫ్‌టేక్ లేదా పేమెంట్ డిఫాల్ట్‌లలో స్థిరంగా పడిపోయిన సందర్భాల్లో కూడా ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను దేశీయ మార్కెట్‌లో విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. ఇది భవిష్యత్తులో అదానీకి వీలు కల్పించే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications