Adani Ports: గెలుపోటములతో సంబంధం లేకుండా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దూసుకుపోతున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. హిండెన్‌బెర్గ్ ఆరోపణల అనంతరం నష్టాలను చూసి కృంగిపోకుండా తన సామ్రాజ్యాన్ని భారీ వృద్ధితో పరుగులు పెట్టించారు. ఇతరులకు సాధ్యంకాని ఓ ఫీట్ సాధించారు.
ఇప్పటి వరకు బీజింగ్-షాంఘై హై స్పీడ్ రైల్వే రవాణా సేవలు అందించడంలో అతిపెద్ద సంస్థగా ఉంది. కాగా ఇప్పుడు ఆ స్థానాన్ని అదానీ కంపెనీ సొంతం చేసుకుంది. 37 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో అదానీ పోర్ట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా మరియు సేవల సంస్థగా అవతరించింది. పెరుగుతున్న కార్గో వాల్యూమ్‌లు మరియు ఇండియా S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్‌లో కంపెనీని చేర్చడం మరింత వృద్ధికి దోహదపడతాయని తెలుస్తోంది.

'అదానీ పోర్ట్స్ సరికొత్త ప్రయాణానికి ఇది నాంది పలికింది. కంపెనీ ఇప్పుడు గణనీయమైన సంపద ఉత్పత్తి చేయడంతో పాటు మిలియన్ల కొద్దీ మెట్రిక్ టన్నుల కార్గోను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. విస్తరణకు మరింత అవకాశం కల్పిస్తూ కంపెనీ ఎదుగుతోంది' అని DRChoksey ఫిన్‌సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవెన్ చోక్సీ తెలిపారు.'కంపెనీ బలమైన బ్యాలెన్స్ షీట్ మరియు కొనుగోలు వ్యూహం మరింత వృద్ధిని సూచిస్తున్నాయి' అని BNP పారిబాస్ సెక్యూరిటీస్ ఇండియా విశ్లేషకులు ప్రియాంకర్ బిస్వాస్ వెల్లడించారు.
మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం కార్గోలో 27 శాతం మరియు కంటైనర్ కార్గోలో 44 శాతాన్ని అదానీ పోర్ట్స్ నిర్వహించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వాల్యూమ్ 24 శాతం పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. దీనితో పాటు 10 దేశీయ ఓడరేవులు రికార్డు గరిష్ఠ స్థాయిలను తాకాయి. కాగా సోమవారం నుంచి అదానీ పోర్ట్స్ బెంచ్‌మార్క్ ఈక్విటీ ఇండెక్స్‌లో చేర్చబడతాయి. తద్వారా కంపెనీ 252 మిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లోలను ఆకర్షిస్తుందనే అంచనాల ఉన్నాయి.


Click it and Unblock the Notifications