Adani Ports: డబుల్ లాభాలు నమోదు చేసిన అదానీ పోర్ట్స్.. డొమెస్టిక్ మార్కెట్లో విస్తరణ..
Q1 Results: అదానీ గ్రూప్ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ జూన్ తో ముగిసిన త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో భారీ లాభాలను నమోదు చేసింది.
తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 82.57 శాతం పెరిగి రూ.2,114.72 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.1,158.28 కోట్లుగా ఉంది. కంపెనీ లాభం గత ఏడాదికంటే 70 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేయగా.. దానికి మించిన పనితీరును కనబరిచి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.5,058.09 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆదాయం 23.51 శాతం పెరిగి రూ.6,247.55 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ సైతం అంచనాలకు మించి నమోదైంది. ఫారెక్స్ ప్రభావంతో సహా ఏకీకృత Ebitda 80 శాతం పెరిగి రూ.3,765 కోట్లకు చేరుకుంది.
FY24 కోసం అదానీ పోర్ట్స్ 370-390 mt కార్గో వాల్యూమ్‌లకు మార్గదర్శకత్వం వహించింది. రూ. 24,000-25,000 కోట్ల ఆదాయాన్ని, రూ.14,500-15,000 కోట్ల ఎబిట్డాను కంపెనీ ఆశిస్తోంది. ఇదే సమయంలో ఏడాదిలో మొత్తం క్యాపెక్స్ రూ.4,000-4,500 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో భారతదేశంలో తమ మార్కెట్ వాటా 200 బేసిస్ పాయింట్లు పెరిగి 26 శాతానికి చేరుకుందని అదానీ పోర్ట్స్ తెలిపింది. కంపెనీ త్రైమాసిక నిర్వహణ పనితీరులో అత్యంత బలమైన త్రైమాసిక పనితీరును అందించిందని సీఈవో అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ కరణ్ అదానీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications