Adani Ports: మరో పోర్టుపై కన్నేసిన అదానీ గ్రూప్.. ఒడిశాలో రేవు కోసం చర్చలు..
Adani News: గౌతమ్ అదానీ నేతృత్వంలోని పోర్ట్స్ వ్యాపారం గడచిన రెండేళ్లుగా వేగంగా విస్తరణను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంకలోని ప్రాజెక్టుకు అమెరికా నుంచి సహకారం సైతం లభించిన సంగతి తెలిసిందే.
తాజాగా అదానీ పోర్ట్స్ ఒడిశాలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నిర్వహిస్తున్న గోపాల్‌పూర్ ఓడ రేవును కొనాలని చూస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.1,100-1,200 కోట్లను ఈక్విటీని అదానీ గ్రూప్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం గోపాల్‌పూర్ పోర్ట్స్‌లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ 56 శాతం వాటాను కలిగి ఉడగా.. ఒరిస్సా స్టీవెడోర్స్ చేతిలో మిగిలిన వాటా ఉంది. స్ట్రింగ్-ఆఫ్-పర్ల్స్ వ్యూహంలో భాగంగా అదానీ తాజా కొనుగోలు వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ పూర్తైతే గోపాల్‌పూర్ పోర్ట్స్.. అదానీ పోర్ట్స్‌కు తూర్పు తీరంలో బహుళ ప్రయోజన సౌకర్యాన్ని అందిస్తుంది. పైగా ఇది ఆరవ కొనుగోలు అవుతుంది. అయితే చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయనే దానిపై అస్పష్టత కొనసాగుతోంది. JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అదే పోర్టు కోసం రూ.3,000 కోట్ల ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్ కోసం మిస్త్రీలతో చర్చలు జరుపుతోందని సమాచారం. అయితే వీటిపై మిస్త్రీ కుటుంబం సంతోషంగా లేదని అర్థమైంది.
పోర్ట్ ఎంటర్‌ప్రైజ్ విలువ దాదాపు రూ.5,000 కోట్లని, మిస్త్రీ ఈక్విటీ విలువ రూ.2,000 కోట్లని ఎస్‌పి గ్రూప్ కంపెనీ ప్రజెంటేషన్‌లో పెట్టుబడిదారులకు తెలిపింది. క్రెడిట్ రేటింగ్ సంస్థ కేర్ ఎడ్జ్ ప్రకారం.. ఫిబ్రవరి నాటికి పోర్ట్‌లో రూ.1,432 కోట్ల దీర్ఘకాలిక బ్యాంకు సౌకర్యాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌లోని షాబాజ్‌లో జెట్టీలను నిర్వహించే సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల PNP మారిటైమ్ సర్వీసెస్‌లో SP గ్రూప్ ఇంతకుముందు 50 శాతం మెజారిటీని విక్రయించింది. గోపాల్‌పూర్ పోర్ట్ వాస్తవానికి రద్దీగా ఉండే పారాదీప్ పోర్ట్ మరియు వైజాగ్ పోర్ట్ మధ్య ఉంది. ఇది NH-516 ద్వారా గోల్డెన్ క్వార్డిలేట్రల్ కూడా అనుసంధానించబడి ఉంది.


Click it and Unblock the Notifications