Adani News: అస్సలు తగ్గని అదానీ.. ఒక్కసారి డిసైడ్ అయితే ఇంతేనా..?
Adani News: గత కొన్ని నెలలుగా అదానీ గ్రూప్ అంటే అప్పుల కుప్ప అంటూ హిండెన్ బర్గ్ నివేదికతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపేందుకు ఆ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
ఇందులు ప్రధానమైనది గ్రూప్ కంపెనీలకు ఉన్న అప్పులను గడువు కంటే ముందే తిరిగి చెల్లించటం. దీని ద్వారా ఆ కంపెనీలపై రుణ భారం తగ్గటంతో పాటు.. ఇన్వెస్టర్లు, స్టేక్ హోల్డర్లలో నమ్మకాన్ని పెంచాలని గౌతమ్ అదానీ నిర్ణయించారు. దీని ద్వారా కంపెనీకి నిధుల కొరత లేదని నిరూపించాలని చూస్తున్నారు. పైగా అంతర్జాతీయ సంస్థలు భారీగా అదానీ గ్రూప్ కంపెనీల్లో కొత్తగా పెట్టుబడులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే 2 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను గడువు కంటే ముందుగానే అదానీ గ్రూప్ చెల్లించింది. తాజాగా.. 2024లో చెల్లించాల్సిన స్వల్పకాలిక 130 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించేందుకు నిర్ణయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి అందించిన వివరాల్లో వెల్లడించింది. అదానీ పోర్ట్స్ కు ఉన్న విదేశీ కరెన్సీ బాండ్ల రూపంలో ఉన్న రుణాన్ని తిరిగి కొనుగోలు చేసేందుకు టెండర్లను దాఖలు చేసింది.
అదానీ గ్రూప్ మొత్తం రుణంలో దాదాపు 39 శాతం విదేశీ కరెన్సీ బాండ్లను కలిగి ఉంటుంది. విదేశీ & భారతీయ బ్యాంకుల నుంచి టర్మ్ లోన్స్ మొత్తం రుణంలో తదుపరి అతిపెద్ద భాగాన్ని కలిగి ఉన్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) బోర్డు.. 2024లో మెచ్యూర్ కావడానికి షెడ్యూల్ చేయబడిన అత్యుత్తమ సీనియర్ నోట్ల కోసం టెండర్ ఆఫర్‌ను ఆమోదించినట్లు ధృవీకరించింది.
ప్రస్తుతం అదానీ గ్రూప్ కంపెనీ అయిన పోర్ట్స్ విదేశీ కరెన్సీ బాండ్లను తిరిగి కొనుగోలు చేసేందుకు కంపెనీ సొంతంగా జనరేట్ చేసిన నిధులను, మిగులు నిధులను మాత్రమే వినియోగించాలని భావిస్తోంది. అంటే ఉన్న రుణాలను తగ్గించుకునేందుకు కొత్త రుణాల వైపు చూడటం లేదు. అలాగే ఇతర అదానీ సంస్థల వద్ద బాండ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ తన వద్ద ఉన్న మూలధనాన్ని కేటాయించే ప్రణాళికను నిర్ణయించే ప్రక్రియలో ఉంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అదానీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని సానుకూలంగా ప్రభావితం చేయనుంది.


Click it and Unblock the Notifications