నడుపుతోంది. కంపెనీ 2011లో కేవలం ముంద్ర, ధహేజా పోర్టులను మాత్రమే కలిగి ఉంది. దీనికి తోడు కంపెనీ ఇటీవల రేటింగ్ ఏజెన్సీ నుంచి AAA రేటింగ్ పొందిన ప్రైవేటు పోర్టు ఆపరేటర్‌గా రికార్డును నెలకొల్పింది.
ప్రస్తుతం అదానీ గ్రూప్ దేశంతో పాటు ఇతరదేశాల్లో సైతం పోర్టులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ ఇప్పుడు దేశం బయట విస్తరణ ప్రణాళికలో భాగంగా ఫిలిప్పీన్స్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మే 2న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ మలాకానాంగ్‌లో ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ R.మార్కోస్ జూనియర్‌తో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అదానీ పోర్ట్స్ వ్యాపార ప్రణాళికను వివరించారు.

ప్రెసిడెంట్ కార్యాలయం ఇచ్చిన వివరాల ప్రకారం.. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ బటాన్ పోర్టును అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రతిపాదిత ప్రాజెక్ట్ పనామాక్స్ నౌకలను నిలిపేందుకు వీలుగా 25 మీటర్ల లోతులో ఓడరేవును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిలిప్పీన్స్‌లోని అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ విస్తరణ ప్రణాళికను ప్రెసిడెంట్ మార్కో స్వాగతించారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఓడరేవులపై దృష్టి పెట్టాలని సూచించారు. దీని ద్వారా ఫిలిప్పీన్స్ ప్రపంచ వేదికపై పోటీపడగలదని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం అదానీ పోర్ట్స్ దేశంలో అతిపెద్ద ఓడరేవుల అభివృద్ధి & నిర్వహణ సంస్థగా కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్ పశ్చిమ తీరం వెంబడి ఏడు వ్యూహాత్మక ఓడరేవులు, టెర్మినల్స్ కలిగి ఉంది. ఇదే క్రమంలో దేశం తూర్పు తీరంలో 8 పోర్ట్స్ ఉన్నాయి. అలాగే కంపెనీ ఇటీవల ప్రకటించిన మార్చి త్రైమాసికంలో సైతం బలమైన ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో అదానీ పోర్ట్స్ మెుత్తం లాభం ఏడాది ప్రాతిపదికన 76 శాతం వృద్ధితో రూ.2,039.66 కోట్లకు ఎగబాకింది. 2023-24లో దేశం మొత్తం కార్గోలో 27 శాతం, కంటైనర్ కార్గోలో 44 శాతం అదానీ పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications