Adani Ports: అదానీ గ్రూప్ స్టార్ కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ నేడు తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ సూపర్ లాభాలను నమోదు చేయటంతో స్టాక్ రాకెట్ పరుగులతో సరికొత్త 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 65 శాతం వృద్ధి చెంది రూ.2,208 కోట్లుగా నమోదైంది. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.1,336.51 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. తొమ్మిది నెలల కాలంలో కంపెనీ మెుత్తం నికర లాభం ఏకంగా రూ.4,252 కోట్లుగా నిలిచింది. అక్టోబర్-డిసెంబర్ 2023 కాలంలో కంపెనీ నికర ఆదాయం రూ.6,920.10 కోట్లుగా నివేదించబడిది.

ప్రస్తుతం ముగిసిన త్రైమాసికంలో కంపెనీ తన అత్యధిక త్రైమాసిక కార్గో పరిమాణం 108.6 MMTని సాధించింది. దాని ఫ్లాగ్‌షిప్ పోర్ట్ ముంద్రా అక్టోబరు 23 దేశంలోని అన్ని ఓడరేవుల్లోనే అత్యధిక నెలవారీ కార్గో వాల్యూమ్‌ను నమోదు చేసింది. నవంబర్ 2023లో భారతదేశపు అత్యధిక నెలవారీ కంటైనర్ వాల్యూమ్‌ను రికార్డ్ చేసింది. దేశీయ కార్గో వృద్ధి 2.5x భారతదేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందని, మూడు త్రైమాసికాల్లో తొమ్మిది దేశీయ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్‌లలో అత్యధిక కార్గో వాల్యూమ్‌లను నమోదు చేశాయని కంపెనీ వెల్లడించింది.
సాయంత్రం 3.08 గంటల సమయంలో అదానీ పోర్ట్స్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో స్వల్పంగా లాభపడి రూ.1,217.15గా ఉంది. అయితే ఇంట్రాడేలో స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.1,239.50 మార్కును నేడు అందుకుంది. హిండెన్ బర్గ్ దాడి తర్వాత మంచి ఆర్థిక ఫలితాలు నమోదు కావటంతో అదానీ పోర్ట్స్ షేర్లలో పెట్టుబడిదారుల కొనుగోళ్లు భారీగా పెరిగాయి.


Click it and Unblock the Notifications