Adani Ports: అదానీ గ్రూప్ దేశంలో విద్యుత్ నుంచి ఓడరేవులు, విమానాశ్రయాల వరకు అనేక రంగాల్లో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ వివాదం నుంచి తేరుకున్న తర్వత అదానీ తన వ్యాపారాలను తిరిగి గాడిలో పెడుతున్నారు. ఈ క్రమంలో కొత్త వ్యాపారాల కొనుగోలును తిరిగి షురూ చేశారు.
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ మంగళవారం మరో భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్ట్‌లో 95% వాటాను 13.49 బిలియన్ రూపాయల ఈక్విటీ విలువకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. అదానీ పోర్ట్స్ గోపాల్‌పూర్ పోర్ట్‌లో రియల్ ఎస్టేట్ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి 56 వాటాతో పాటు ఒరిస్సా స్టీవెడోర్స్ నుంచి 39% వాటాను కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ ఎంటర్‌ప్రైజ్ విలువ 30.80 బిలియన్ రూపాయలుగా ఉంది.

గోపాల్‌పూర్ ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, ఇల్మెనైట్, అల్యూమినాతో సహా డ్రై బల్క్ కార్గో విభిన్న మిశ్రమాన్ని నిర్వహిస్తోంది. గోపాల్‌పూర్ పోర్ట్ అదానీ గ్రూప్ పాన్-ఇండియా పోర్ట్ నెట్‌వర్క్‌కు అదనపు కెపాసిటీని జోడిస్తోంది. ఈస్ట్ కోస్ట్ vs వెస్ట్ కోస్ట్ కార్గో వాల్యూమ్ పారిటీకి, APSEZ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ విధానాన్ని బలోపేతం చేస్తుందని అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తెలిపారు.
ప్రస్తుతం అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దేశంలోని పశ్చిమ-తూర్పు తీరంలో దాదాపు 12 ఓడరేవులు, టెర్మినల్స్‌ను అభివృద్ధి నిర్వహణలో ఉంది. కంపెనీ తన కెపాసిటీలను కొత్త కొనుగోళ్లతో పెంచుకుంటూ పోతుండగా.. అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్‌గా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications