భారత బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత బలపడేలా మరో పెద్ద ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారు. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఖావ్డా ప్రాంతంలో బహుళ బిలియన్ డాలర్ల విలువైన భారతదేశంలోనే అతి పెద్ద బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ (Battery Energy Storage System - BESS) నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టును మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు Adani Group తెలిపింది. పూర్తయిన తర్వాత ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సింగిల్-లొకేషన్ బ్యాటరీ నిల్వ సదుపాయాల్లో ఒకటిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, వ్యాపార వ్యూహాలపై చర్చలు జరుగుతున్నందున పేర్లు వెల్లడించరాదని సమాచారం అందించిన వర్గాలు కోరాయి.

అదానీ గ్రూప్ ఇప్పటికే ఖావ్డాలో విస్తారమైన పునరుత్పాదక ఇంధన సముదాయాన్ని (Renewable Energy Hub) అభివృద్ధి చేస్తోంది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు భారీ గ్రిడ్ స్థాయి నిల్వ వ్యవస్థను కలిపి అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోని విద్యుత్ సరఫరా స్థిరత్వాన్ని పెంచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ బ్యాటరీ నిల్వ వ్యవస్థ ప్రాథమికంగా 20 గిగావాట్ గంటల (GWh) సామర్థ్యంతో ప్రారంభమై తదుపరి ఐదు సంవత్సరాల్లో 50 GWh వరకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇది భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ చేపట్టని స్థాయి ప్రాజెక్టుగా పరిగణించబడుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శక్తి వ్యవస్థల్లో బ్యాటరీ నిల్వలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో, గ్రిడ్‌లు విద్యుత్ సరఫరా సమతుల్యతను కాపాడటంలో ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాటరీ నిల్వ వ్యవస్థలు విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు నిల్వ చేసుకుని, అవసరమైన సమయంలో విడుదల చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వం, శక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
బ్లూమ్‌బెర్గ్‌ఎన్‌ఇఎఫ్ (BloombergNEF) తాజా డేటా ప్రకారం..భారతదేశంలో బ్యాటరీ నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 800 మెగావాట్ల సమీపంలో ఉందని అంచనా. కానీ దేశం దశాబ్దం చివరి నాటికి 500 గిగావాట్ల పచ్చ విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, బ్యాటరీ సంస్థాపనలను వేగవంతం చేయడం అత్యవసరమైందని నిపుణులు సూచిస్తున్నారు.అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్ట్‌కు సాంకేతిక మద్దతు కోసం అనేక అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలతో చర్చలు జరుపుతోందని తెలిసింది.
వీటిలో యూరప్, జపాన్, అమెరికాకు చెందిన ప్రముఖ శక్తి నిల్వ టెక్నాలజీ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. అయితే అదానీ గ్రూప్ ప్రతినిధులు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక వ్యాఖ్యానాలు చేయకుండా వివరాలను త్వరలో వెల్లడిస్తాంఅని మాత్రమే పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తి అయితే, భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి పోటీదారుగా ఎదగడమే కాకుండా, విద్యుత్ నిల్వ సామర్థ్యంలో కూడా స్వావలంబన సాధించే దిశగా కీలక అడుగు వేస్తుందనేది నిపుణుల అభిప్రాయంగా చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications