Ambuja Cement: సిమెంట్ వ్యాపారంలో అదానీ గ్రూప్ ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ తాను కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్ లాభాలు భారీగా మెరుగుపరిచింది.
అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ రెండవ త్రైమాసికంలో ఏకంగా రూ.729.96 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ లాభం ఏడాది ప్రాతిపదికన 750.99 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.93.18 కోట్ల నుంచి 9 రెట్లు పెరగటం గమనార్హం. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.7,423.95 కోట్లుగా నివేదించబడింది. ప్రధానంగా ఆదాయాలు పెరగటంతో పాటు ఖర్చులను తగ్గించుకోవటం బలమైన లాభాలకు కారణంగా నిలిచింది.

ప్రీమియం సిమెంట్ ఉత్పత్తులకు బలమైన డిమాండ్‌తో పాటు.. కార్యాచరణ నైపుణ్యం, సరఫరా గొలుసు నిర్వహణ, సేల్స్ & మార్కెటింగ్ ఎక్సలెన్స్ వ్యాపార పనితీరును మెరుగుపరచటంలో కీలకంగా నిలిచాయని అంబుజా సిమెంట్స్, హోల్ టైమ్ డైరెక్టర్ & CEO అజయ్ కపూర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది. కంపెనీ తన కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చడానికి, కార్బన్ పాదముద్రను తగ్గించడానికి స్థిరంగా చర్యలు తీసుకుంటోంది. అలాగే భటపరా వద్ద 4 MTPA సామర్థ్యంతో కొత్త సదుపాయం కోసం ఆర్డర్ చేయబడిన పరికరాలు కాకుండా, సివిల్ ఎగ్జిక్యూషన్ వర్క్ ప్రారంభించింది. అయితే మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో 3.49 శాతం క్షీణించి రూ.409.65 వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications