Adani networth: దాదాపు గతేడాది మొత్తం ఒడిదుడుకుల మధ్య సాగిన అదానీ గ్రూప్ ప్రయాణం ఈ సంవత్సరం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ తిరిగి కోల్పోయిన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ప్రయాణంలో ఓ కీలక రికార్డు నెలకొల్పింది.
2023 ప్రారంభంలో అమెరికన్ షార్ట్ సెల్లర్ రిపోర్ట్ కారణంగా భారతీయ అదానీ గ్రూప్ సంక్షోభంలో కూరుకుపోయింది. తిరిగి ఏడాది తిరిగే సరికి గౌతమ్ అదానీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందారు. బుధవారం ఆయన సంపద నికర విలువ 100.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనంతరం తొలిసారి మళ్లీ ఈ రికార్డు స్థాయిని టచ్ చేసింది.

ఆయన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు గత వారం 130 శాతం భారీ లాభాలను నమోదుచేశాయి. దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఇప్పుడు ప్రపంచంలోని 12వ అత్యంత ధనవంతుడిగా అవతరించారు. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల ఎలైట్ క్లబ్‌కి తిరిగి రావడానికి అదానీ గ్రూప్ ఛైర్మన్‌కు సంవత్సరం పట్టింది. అయితే ఇప్పటికీ 2022లోని గరిష్ఠ స్థాయికి 50 బిలియన్ డాలర్ల దిగువనే ఉన్నారు.
ఆరోపణల అనంతరం అదానీ సంపద 80 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించి కనిష్ట స్థాయి 37.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక దశలో గ్రూప్ 150 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువను కోల్పోయింది. రుణాలను తిరిగి చెల్లించడానికి మరియు నియంత్రణ సమస్యలను తగ్గించడానికి నెలల తరబడి పోరాడాల్సి వచ్చింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications