Adani Media: ఇన్నాళ్లుగా అనేక రకాల రంగాల్లో వ్యాపారాలను కొనుగోలు చేస్తూ.. రాకెట్ వేగంతో ఎదుగుతున్న గౌతమ్ అదానీ తాజాగా మరో సంచలనాన్ని ప్రకటించారు. అదానీ మీడియా రంగంలోకి ప్రవేశించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో అదానీ మీడియా విభాగం దేశంలోని ప్రఖ్యాత వార్తా సంస్థ వాటాలు కొనుగోలుపై ప్రెస్ నోట్ విడుదల చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మీడియా వ్యాపారంలో విస్తరణ..
దేశంలో ఎక్కువ గుర్తింపు, నమ్మకమైన వార్తలను అందించే మీడియా సంస్థగా గుర్తింపు ఉన్న NDTVలో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలోని ఎఎమ్‌జీ మీడియా నెట్‌వర్క్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
మెుత్తం కొనుగోలు నిర్ణయం..
అదానీ గ్రూప్ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (NDTV)లో 29.18 శాతం వాటాను కొనుగోలు చేయనున్నామని, కంపెనీలో మరో 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ఇస్తామని ఆగస్టు 23న ప్రకటించింది. విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ద్వారా 29.18 శాతం వాటాను కొనుగోలు చేయడం పరోక్షంగా జరుగుతోంది.

NDTV లాభాలు ఇలా..
NDTV ప్రస్తుతం దేశంలోNDTV 24x7, NDTV India, NDTV Profit అనే మూడు జాతీయ వార్తా ఛానెల్‌లను నిర్వహిస్తోంది. డిజిటల్ గా కూడా కంపెనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.421 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పన్నులతో పాటు ఇతర ఖర్చుల చెల్లింపుల తరువాత కంపెనీ నికర లాభం రూ.85 కోట్లుగా ఉంది.

NDTV షేర్ విలువ..
NDTV షేర్లు బీఎస్‌ఈలో రూ.374.70 వద్ద మంగళవారం ముగిశాయి. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో షేరు 3.09 శాతం పెరిగి రూ.369.75 వద్ద ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో.. అదానీ గ్రూప్ కొనుగోలు చేసే అవకాశం ఉందన్న నివేదికల మధ్య NDTV స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ఈ వార్తలో రేపు మార్కెట్లో స్టాక్ పరుగులు తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications