Adani Issue: ఈ ఏడాది ఎక్కడ చూసినా అదానీ పేరే. వార్తల్లో నిరంతరం 2024లో గౌతమ్ అదానీ, ఆయన వ్యాపారాలకు సంబంధించిన వివిధ వార్తలు రావటం ఇన్వెస్టర్లకు మేలు కంటే హానే ఎక్కువ కలిగించింది. గడచిన ఏడాది హిండెన్ బర్గ్ వ్యవహారం షాక్ నుంచి ఇన్వెస్టర్లు మరచిపోకమునుపే ఈ ఏడాది మరికొన్ని స్టోక్స్ తగిలాయి. వివరాల్లోకి వెళితే..
ముందుగా అదానీకి సెబీ మద్దతుగా నిలిచిందనే ఆరోపణలు తీవ్రస్థాయిలకు చేరుకున్నాయి. హిండెన్‌బర్గ్ తన కొత్త నివేదికలో భారతీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చైర్మన్ మాధవి పూరి బుచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10, 2024న విడుదల చేసిన నివేదిక ప్రకారం అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణంలో ఆమెకు సైతం ప్రమేయం ఉన్నట్లు పేర్కొనబడింది. అదానీ గ్రూప్ గురించి నివేదిక సమర్పించి అనేక నెలలు గడిచినా సెబీ చర్యలు లేకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే అదానీ మనీలాండరింగ్ కుంభకోణంలో ఉపయోగించిన రెండు ఆఫ్‌షోర్ ఎంటిటీల్లో బీ చైర్‌పర్సన్ మాధబి పూరీ, ఆమె భర్త ధవల్ బుచ్ వాటాలు కలిగి ఉన్నారని నివేదించటంతో స్టాక్ మార్కెట్లలో పెద్ద సునామీ వచ్చింది. దీనిలో అదానీ ఇన్వెస్టర్లు పెద్ద నష్టాన్ని చూశారు.

ఈ షాక్ నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తేరుకుంటుండగానే.. ఇటీవల అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీ సోలార్ వ్యాపారానికి సంబంధించి అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీపై సంచలన ఆరోపణలు బయటకు వచ్చాయి. అదానీ గ్రూప్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు అధిక ధరలకు సోలార్ విద్యుత్ అమ్మేందుకు అగ్రిమెంట్లు కుదుర్చుకోవటం కోసం అక్కడి ఉన్నతస్థాయి అధికారులకు లంచాలను ఎరవేసిందనే విషయం పెద్ద సంచలనంగా మారింది. పైగా ఇందులోనూ ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. లంచాల వ్యవహారంలో నేరుగా అదానీ డీల్స్ కుదర్చటం కోసం పలు దఫాలు అధికారులను కలిసి వారిపై ఒత్తిడిని పెంచారనే విషయాలను అమెరికా కోర్టులో వెల్లడయ్యాయి.
ఏపీకి జరుగుతున్న నష్టం..
అదానీపై లంచం ఆరోపణలకు కేంద్రంగా ఉన్న గుజరాత్ ఆధారిత సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఏపీకి సరఫరా చేయబడే విద్యుత్ kWhకి రూ.2.49 చౌకగా అందుబాటులో ఉండని వెల్లడైంది. ఇక్కడ సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్‌లపై విధించే ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయబడుతుందని డీల్ పత్రాల ప్రకారం బయటపడింది. దీని కారణంగా విద్యుత్ టారిఫ్ కిలోవాట్ కి అదనంగా 50 పైసలు పెరగనుంది. అంటే కిలోవాట్ ధర రూ.2.49 నుంచి రూ.3.069కి పెరగనుంది. అంటే దీని ప్రకారం ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు అదనంగా మరో రూ.850 కోట్లు సమర్పించుకోవాల్సిందేనని వెల్లడైంది. వాస్తవానికి ఇది ప్రజలపై మరింత భారాన్ని మోపవచ్చని తెలుస్తోంది.
అదానీ గ్రీన్ ఎక్స్ఛేంజీలలో విద్యుత్తు అధిక ధరలకు విక్రయిస్తోంది. ఏపీకి సరఫరా ఆలస్యం జరిగినప్పటికీ అదే ప్రాజెక్ట్ నుంచి విద్యుత్‌ను విక్రయిస్తోంది. యూనిట్‌కు సగటున రూ.3.5 ధరగా విక్రయం జరుగుతోంది. ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అంగీకరించిన యూనిట్‌కు రూ.2.42 కంటే ఇది 40 శాతం అధికం. ఇదే క్రమంలో అదానీ సోలార్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో.. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications