హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (పిసిఐఎల్)ని కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్ గురువారం ప్రకటించింది. పెన్నా విలువ రూ.10,422 కోట్లుగా అంచనా వేశారు. రెండేళ్ల కిందటే అంటే సెప్టెంబర్ 2022లో సిమెంట్ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీలను కొనుగోలు చేస్తోంది. పెన్నా సిమెంట్ అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన మూడో కంపెనీ. అంబుజా సిమెంట్స్ దాని ప్రస్తుత ప్రమోటర్ గ్రూప్ - పి ప్రతాప్ రెడ్డి, కుటుంబం నుంచి పిసిఐఎల్ 100 శాతం షేర్లను కొనుగోలు చేస్తుంది.
పెన్నా సిమెంట్ కొనుగోలుతో అంబుజా సిమెంట్ సామర్థ్యం సంవత్సరానికి 14 మిలియన్ టన్నులు పెరగనుంది. దీంతో అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారం (ACC-అంబుజా కన్సాలిడేటెడ్) మొత్తం సామర్థ్యాన్ని 89 mtpaకి తీసుకువెళుతుంది. మూడు, నాలుగు నెలల్లో డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. పెన్నా సిమెంట్ 2019లో పబ్లిక్‌గా వెళ్లేందుకు విఫల ప్రయత్నం చేసింది. ఇండియా రేటింగ్స్, కంపెనీకి సంబంధించిన జనవరి నోట్‌లో, పెన్నా సిమెంట్ 2023-24 ప్రథమార్థంలో రూ. 11 కోట్ల ఎబిటా నష్టాన్ని నివేదించింది.

ప్రస్తుతం పెన్నా సిమెంట్ 10 mtpa సామర్థ్యంతో పనిచేస్తోంది. ఈ కంపెనీకి కృష్ణపట్నం (2 mtpa), జోధ్‌పూర్ (2 mtpa) ప్లాంట్లు ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ కొనుగోలుకు పూర్తి నిధులను అంతర్గత అక్రూవల్స్ ద్వారా సమకూరుస్తామని తెలిపింది. ఈ కొనుగోలు భారతదేశ సిమెంట్ వ్యాపారంలో అదానీ గ్రూప్ మార్కెట్ వాటాను 2 శాతం నుంటి 16 శాతానికి పెంచనుంది. మే ఇన్వెస్టర్ ప్రజెంటేషన్‌లో 2028 నాటికి భారతీయ సిమెంట్ మార్కెట్‌లో 20 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.
FY24లో అంబుజా సిమెంట్ గుజరాత్‌లోని సంఘీ ఇండస్ట్రీస్ సిమెంట్ ను కొనుగోలు చేసింది. ఏప్రిల్‌లో తమిళనాడులోని మైహోమ్ ఇండస్ట్రీస్ గ్రైండింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ కంపెనీ అంగీకరించింది. అంబుజా సిమెంట్స్ పెన్నా సిమెంట్స్ లొకేషన్‌ను పెనా సిమెంట్స్ ద్వారా దక్షిణ భారతదేశం ప్రవేశించడమే కాకుండా, సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications