Adani News: ఇన్వెస్టర్లు హ్యాపీ.. ఆ ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టిన అదానీ గ్రూప్..!!
Adani News: 2023 సంవత్సరంలో అదానీ గ్రూప్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. తక్కువ సమయంలోనే రెండు సార్లు విదేశీ సంస్థలు విడుదల చేసిన రిపోర్టులు అదానీ గ్రూప్ కంపెనీల విలువను ఆవిరి చేశాయి.
అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి పెరిగిన నమ్మకం కారణంగా కొనుగోళ్లు అదానీ కంపెనీలకు కలిసొచ్చింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం ఒక్కరోజునే రూ.7,039 కోట్ల మేర పెరిగింది. 10 లిస్టెండ్ కంపెనీల విలువ పెరుగుదల దీనికి కారణంగా ఉంది.

మార్చి 2023 ప్రారంభం నుంచి హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకున్నాయి. అప్పటి నుంచి మార్కెట్ క్యాప్ 5 ట్రిలియన్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు ముందస్తు రుణ చెల్లింపులు, విదేశాల్లో స్టీట్ షోలు కలిసొచ్చాయి. ఈ క్రమంలో.. అదానీ పోర్ట్స్ మార్కెట్ విలువ 1.86% పెరిగి రూ.1.78 ట్రిలియన్లకు చేరుకుంది. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్ శుక్రవారం 0.39% పెరిగి 2,519.30 వద్ద ముగిసింది. అయితే దాని విలువ రూ.2.87 ట్రిలియన్‌లను దాటింది.
అదానీ గ్రూప్ షేర్లలో ట్రేడింగ్ చేసేందుకు ఆఫ్‌షోర్ ఒప్యాక్ ఫండ్లను వినియోగించిందంటూ చేసిన ఆరోపణలను రీసైకిల్డ్ ఆరోపణలుగా ఇటీవల కొట్టేసింది. ఇటీవల స్టాక్ ధరల పురోగతి, మార్కెట్ క్యాప్ పెరుగుదల అదానీ వ్యాపారాలపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. అమెరికాకు చెందిన GQG పార్ట్నర్స్ గత ఆరు నెలల్లో ఐదు అదానీ గ్రూప్ కంపెనీల్లో 4 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టింది.


Click it and Unblock the Notifications