Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీ బిగ్ హార్ట్.. రైలు ప్రమాద బాధితుల కోసం..
Train Accident: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియాలో సంపన్నుడైన గౌతమ్ అదానీ ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించారు. బాధితులకు చేయూతనిచ్చేందుకు నేనున్నానంటూ తన దాతృత్వాన్ని చాటుకునే ప్రకటనను విడుదల చేశారు.
దేశంలో అత్యంత బాధాకరమైన ఘోర రైలు ప్రమాదం ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఇందులో అనేక మంది తమ దగ్గరి బంధువులను, కుటుంబసభ్యులను, తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో దాదాపు 288 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 1200 మంది గాయపడ్డారు. దీనిపై రైల్వేశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రైల్వే శాఖతో పాటు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన అమాయక పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు అదానీ తన ట్విట్టర్ ఖాతాలో రాశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన అమాయకుల పాఠశాల విద్య బాధ్యతను తాము తీసుకుంటామంటూ ట్వీట్ చేయటం ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. బాధిత కుటుంబాలకు అండగా నిలబడటంతో పాటు.. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించటం మనందరి ఉమ్మడి బాధ్యతని బిలియనీర్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications