adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈక్విటీతో పాటు బాండ్ మార్కెట్లోనూ పరాభవం తప్పడం లేదు. ఈ అంశం పార్లమెంటును సైతం కుదిపేస్తోంది. రోజుల తరబడి ఇరు సభలూ వాయిదా పడుతూనే ఉన్నాయి. అయితే అదానీ సంస్థలు మాత్రం ఆరోపణలను ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో పూర్తిగా సబ్ స్రైబ్ అయిన FPOను రద్దుచేస్తూ.. ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి ఇచ్చారు. ఇప్పుడు షేర్లపై తీసుకున్న రుణాలను మెచ్యూరిటీకి ముందే చెల్లించేందుకు సిద్ధమయ్యారు.

సమయం ఉన్నా..
అదానీ గ్రూపు ప్రమోటర్లు తాకట్టు పెట్టిన షేర్లను విడిపించుకోవడానికి 1.11 బిలియన్ డాలర్ల రుణాలను ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 2024 వరకు సమయం ఉన్నా, మార్కెట్ లో ఒడిదుడుకుల కారణంగా మెచ్యూరిటీకి ముందే రుణం తీర్చేందుకు యత్నిస్తున్నారు.
తద్వారా అదానీ పోర్ట్స్ & సెజ్ లో 9.34 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ లో 10 శాతం, గ్రీన్ ఎనర్జీలో 5 శాతం విడిపించుకుంటున్నట్లు అదానీ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది.

ఇచ్చిన హామీ మేరకు:
అంటే అదానీ పోర్ట్స్ కు చెందిన 168.27 మిలియన్ షేర్లు(ప్రమోటర్ల హోల్డింగ్‌లో 12 శాతం), అదానీ గ్రీన్ ఎనర్జీలోని 27.56 మిలియన్ షేర్లు (ప్రమోటర్ల హోల్డింగ్‌లో 3 శాతం), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 11.77 మిలియన్ షేర్లు(ప్రమోటర్ల హోల్డింగ్‌లో 3 శాతం) విడుదల చేయబడతాయన్నమాటు. షేర్ల హామీతో తీసుకున్న రుణాలను ముందుగా చెల్లిస్తామన్న ప్రమోటర్ల హామీకి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది.

ప్రకటనతో లాభాల్లోకి:
గ్రూపు కంపెనీల బ్యాలెన్స్ షీట్, రుణ చెల్లింపుల సామర్థ్యంపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు.. తాకట్టులోని షేర్లు విడిపిస్తున్నట్లు కంపెనీ సోమవారం తెలిపింది. ఈ ప్రకటన రాగానే అదానీ పోర్ట్స్ షేర్లు 6 శాతంకి పైగా పెరిగి 528.40కి చేరాయి. నిఫ్టీ 50లో టాప్ గెయినర్ గా నిలిచింది. కానీ అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ విల్మర్లు 5 శాతం మరియు అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ 10 శాతం లోయర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దాదాపు 2 శాతం క్షీణించి రూ.1,564.90 వద్దకు చేరాయి.

బాండ్ మార్కెట్లలోనూ భయాందోళనలు:
అదానీ కంపెనీలపై కొన్ని రేటింగ్ ఏజెన్సీలు ఆందోళన లేవనెత్తాయి. హిండెన్ బర్గ్ నివేదించిన కారణాలతో ఔట్‌లుక్ ను తగ్గించాయి. సిటీ గ్రూప్, క్రెడిట్ సుస్సీ వంటి బ్యాంకులు అదానీ సెక్యూరిటీలను పూచీకత్తుగా అంగీకరించడం మానేయడంతో బాండ్ మార్కెట్లు భయాందోళనకు గురయ్యాయి. తద్వారా అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు గత 8 ట్రేడింగ్ సెషన్లలో 37 నుంచి 54 శాతానికి పైగా నష్టపోయాయి. ఆందోళన చెందాల్సిన స్థాయిలో ఎక్స్ పోజర్ లేదని బ్యాంకులు ప్రకటించాయి. అయితే రుణాల్లో కొంత భాగాన్ని తిరిగి చెల్లించమని రుణదాతలు కోరి ఉంటారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications