Adani: అదానీ గ్రూపు చేతుల్లోకి ఆ మీడియా సంస్థ.. కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడి
Adani: అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం తిరిగి పుంజుకోవడానికి అదానీ గ్రూపు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రుణ భారాన్ని తీర్చుకుంటూ దూసుకుపోతోంది. కొన్ని ఇబ్బందికర ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటూ, మరికొన్ని కొత్త వ్యాపారాలను టేకోవర్ చేస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
క్వింటిలియన్ బిజినెస్ మీడియా(BQ ప్రైమ్)లో మిగిలిన 51 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. గతేడాది మార్చిలో ఇందులో 49 శాతం వాటాను అదానీ గ్రూపు 47.84 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని కైవసం చేసుకోనున్నట్లు పేర్కొంది.

డిసెంబర్ 2022లో బ్రాడ్‌కాస్టర్ NDTVలో దాదాపు 65 శాతం వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అయితే అంతకు ముందే BQ ప్రైమ్ లో వాటా పొందడంతో ఇండియన్ న్యూస్ విభాగంలోకి ప్రవేశించింది. ఆగస్టు 14న జరిగిన వార్షిక సమావేశంలో అదానీ కంపెనీ బోర్డు డైరెక్టర్లు, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్ మధ్య బైండింగ్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ జరిగినట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది.
BQ ప్రైమ్ గతంలో బ్లూమ్ బెర్గ్ క్వింట్ గా పసిద్ధి చెందింది. US వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ మీడియా మరియు ఇండియాలోని క్వింటిలియన్ మీడియా జాయింట్ వెంచర్ గా ఇది ప్రారంభమైంది. అయితే గతేడాది మార్చిలో బ్లూమ్ బెర్గ్ ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. తాజా 51 శాతం కొనుగోలుతో AMG మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్ అదానీ గ్రూపు పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా మారనుంది.


Click it and Unblock the Notifications