Adani Group: దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కూడా ఉంది. గ్రూప్ వ్యాపారాలపై కొన్ని వివాదాలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా అదానీ ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ మొత్తం అప్పుల్లో దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వాటా 36 శాతానికి పెరగటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అదానీ గ్రూప్ వేగవంతమైన వృద్ధితో పాటు వ్యాపార సామ్రాజ్య రుణం కూడా పెద్ద ఎత్తున పెరుగుతోంది. ముఖ్యంగా అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్లను తనఖా పెట్టి దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం గత 2 ఏళ్లుగా ఒక ముఖ్యమైన సమస్యగా పరిగణించబడుతోంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం దేశీయ రుణాలు దాదాపు 36 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ మొత్తం రుణాలు 5 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు వృద్ధికి అనుగుణంగా అదానీ గ్రూప్ లోని కొన్ని కంపెనీల్లో కొనసాగుతున్న భారీ పెట్టుబడులు రుణభారాన్ని పెంచుతున్నాయి.

మార్చి 31, 2024 చివరి నాటికి భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అదానీ గ్రూప్‌కు మొత్తం రూ.88,100 కోట్ల రుణాలున్నాయి. ఇది అదానీ గ్రూప్ మొత్తం రుణమైన రూ.2,41,394 కోట్లులో 36 శాతానికి సమానమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే గ్రూప్ రుణాల విషయంలో మార్చి 31, 2023 డేటాను పరిశీలిస్తే.. దేశీయ ప్రైవేట్-పబ్లిక్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అదానీ గ్రూప్‌కు దాదాపు రూ.70,213 కోట్ల రుణాలు ఇచ్చాయి. అప్పట్లో గ్రూప్ మెుత్తం రుణ భారం రూ.2,27,248 కోట్లుగా ఉంది. అంటే మెుత్తం రుణాల్లో అప్పుడు దేశీయ సంస్థల వాటా 31 శాతంగా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా బ్యాంకులు అదానీ గ్రూప్‌కు అదనపు రుణాలు మంజూరు చేశాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో ఈ రుణాలపై కొంత ఆందోళనలు కూడా ఉన్నాయి. అలాగే మార్చి 31, 2024 నాటికి గ్లోబల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అదానీ గ్రూప్ స్వల్పంగా రూ.63,781 కోట్ల నుంచి రూ.63,296 కోట్లకు తగ్గాయి. అలాగే గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తీసుకున్న రుణం రూ.72,794 కోట్ల నుంచి రూ.69,019 కోట్లకు తగ్గాయి. ప్రధానంగా గత ఏడాది హిండెన్ బర్గ్ దాడి తర్వాత అప్రమత్తమైన అదానీ గ్రూప్ తన విదేశీ రుణాల భారాన్ని తగ్గించుకుని తదనుగుణంగా దేశీయంగా లోన్స్ పొందినట్లు డేటా ప్రకారం తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications