Adani News: చరిత్ర సృష్టించిన అదానీ కంపెనీ.. వరుసగా రెండోసారి టాప్ 2 ప్లేస్ సొంతం

Adani Enterprises: హిండెన్‌ బెర్గ్ నివేదిక వల్ల ఈ ఏడాది ప్రారంభంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న అదానీ గ్రూప్.. తరువాత మెల్లమెల్లగా పుంజుకుంది. భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను సమీకరించి తన టాప్ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వాటిలో అదానీ ఎంటర్‌ ప్రైజెస్ మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.

అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఓ ఘనత సాధించింది. 2018-2023కి గాను మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన టాప్ 10 వెల్త్ సృష్టికర్తలలో అసాధారణమైన ఫీట్‌ నెలకొల్పింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఈ సంస్థ వరుసగా రెండోసారి ఉత్తమ ఆల్ రౌండ్ సంపద సృష్టికర్తగా పేరు గాంచింది.

Adani group stood second position after Reliance in wealth creations among top 100

అతిపెద్ద, వేగవంతమైన మరియు స్థిరమైన ప్రమాణాల ఆధారంగా మోతీలాల్ ఓస్వాల్ ఈ ర్యాంకులను ఇచ్చింది. స్కోర్‌లు టై అయిన చోట స్టాక్ ధర CAGR ద్వారా ఆల్ రౌండ్ ర్యాంక్‌ను నిర్ణయించింది. ఈ మేరకు తన 28వ వార్షిక సంపద సృష్టి అధ్యయనానికి సంబంధించిన వివరాలను విడుదల చేసింది.

స్టాక్ ధర కనీస బెంచ్‌మార్క్ (BSE సెన్సెక్స్‌)ను అధిగమించిన కంపెనీలను మోతీలాల్ ఓస్వాల్ పరిగణలోనికి తీసుకుంది. ఆయా సంస్థలు సృష్టించిన సంపద ఆధారంగా అవరోహణ క్రమంలో టాప్ 100 కంపెనీలకు ర్యాంక్ ఇచ్చింది. ఈ క్రమంలో వాటి వేగాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా ఐదవసారి అతిపెద్ద సంపద సృష్టికర్తగా అవతరించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+