Adani Stocks: అదానీ కుటుంబ భాగస్వాములు ఒపెక్ ఫండ్స్ ద్వారా సొంత కంపెనీల్లో షేర్ల క్రయవిక్రయాలు జరిపినట్లు వస్తున్న కొత్త ఆరోపణలు సంచలనంగా మారాయి. OCCRP చేసిన ఆరోపణలు మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి.
అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందంటూ గుప్పుమన్న వార్తలతో మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఉన్న గ్రూప్ కంపెనీల షేర్లను విక్రయించేందుకు ప్రయత్నించటంతో స్టాక్స్ ధర కుప్పకూలుతోంది. అమ్మకాల ఒత్తిడికి ధరలు చిత్తు కావటంతో మార్కెట్ క్యాప్ ఆవిరైపోతోంది. మళ్లీ పరిస్థితులు జనవరి చివరి నాటి రోజులను తలపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆరోపణలపై స్పందిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ.. వాటిని ఖండించినప్పటికీ స్టాక్స్ పతనం మాత్రం మార్కెట్లో కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ.9,570.31 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.6,200 కోట్లు, అదానీ పోర్ట్స్ రూ.5,000 కోట్లు, అదానీ పవర్ రూ.5,300 కోట్లు మార్కెట్ క్యాప్ ఆవిరికావటంతో గ్రూప్ విలువ రూ.35,624 కోట్ల మేర పడిపోయింది. అదానీ గ్రూప్ స్టాక్స్ ఒత్తిడిలోనే ఉండటంతో.. 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల కంబైన్డ్ మార్కెట్ క్యాప్ బుధవారం రూ.10,84,668.73 కోట్ల నుంచి రూ.35,624 కోట్లు తగ్గి రూ.10,49,044.72 కోట్లకు పడిపోయింది. ఇదే క్రమంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు రూ.3,000 కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకగా.. అంబుజా సిమెంట్స్ మార్కెట్ విలువ రూ.2,680 కోట్లు క్షీణించింది.
పతనాన్ని కొనసాగిస్తూ గ్రూప్ లోని.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 5.11 శాతం పడిపోయి బీఎస్ఈలో రూ.2,385 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదానీ పోర్ట్స్ 2.92 శాతం క్షీణించి రూ.795.10కి చేరుకుంది. అదానీ పవర్ 4.45 శాతం తగ్గి రూ.313.80కి చేరుకుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.53 శాతం క్షీణించి రూ.812.05కి చేరుకుంది. అదానీ గ్రీన్ 4.37 శాతం పతనమై రూ.928.25కి చేరుకుంది. అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్, ఏసీసీ, ఎన్డీటీవీ షేర్లు 3.2 శాతం మేర కోతకు గురయ్యాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications