Adani: అదానీ గ్రూపునకు చెందిన కొన్ని షేర్లలో ఇవాళ భారీ ర్యాలీ కనిపించింది. అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ విల్మార్ షేర్లు 7 శాతం వరకు పెరిగాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలు NSE, BSEలు తీసుకున్న తాజా చర్యలు ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల షేర్స్ సర్క్యూట్ ఫిల్టర్‌లను BSE సవరించింది. ఇతర గ్రూప్ కంపెనీల్లో మంచి ర్యాలీ కనిపించినా.. అది ఈ స్థాయిలో లేదు. అదానీ పవర్ సర్క్యూట్ ఫిల్టర్‌ను 20 శాతానికి BSE సవరించిన తర్వాత షేరు విలువ 7 శాతం కంటే ఎక్కువ పెరిగి 281.2కి చేరుకుంది. తాజా మార్పునకు ముందు ఇది 5 శాతంగా ఉంది. కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.1 లక్షల కోట్లకు చేరువలో ఉంది.

అదానీ ట్రాన్స్‌మిషన్ కొనుగోలు రేటింగ్‌ను గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ 1,400 టార్గెట్‌గా సూచింంచింది. దీంతో దాని షేరు విలువ దాదాపు 4 శాతం లాభపడి 845కి పెరిగింది. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 95 వేల కోట్లకు చేరువైంది. మునుపటి ముగింపుతో పోలిస్తే తాజా రేటింగ్ వాల్యూ 72 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
అదానీ విల్మార్, అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అదానీ ట్రాన్స్‌మిషన్‌ల సర్క్యూట్ ఫిల్టర్‌లు ఒక్కొక్కటీ 5 శాతం నుండి 10 శాతానికి సవరించబడ్డాయి. NSE మరియు BSE స్వల్పకాలిక ASM ఫ్రేమ్‌వర్క్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ సెక్యూరిటీలను తొలగించిన వారం తర్వాత ఎక్స్ఛేందీలు ఈ చర్యలు అమల్లోకి వచ్చాయి.
ఎక్స్ఛేంజీలలోని సర్క్యూట్ ఫిల్టర్ ద్వారా ఆయా షేర్ల గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తారు. మార్కెట్ సమగ్రతను కాపాడటానికి మరియు సెక్యూరిటీలలో అధిక ధరలు లేదా అస్థిరతను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్‌తో సహా ఇతర అదానీ గ్రూప్ స్టాక్‌లు ఒక్కొక్కటి చొప్పున ఇందులో జోడించబడ్డాయి. మొత్తం 172 కంపెనీల సర్క్యూట్స్ ఫిల్టర్లలో మార్పులు చేయాలని ఎక్స్ఛేంజీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications