Gautam Adani: అదానీ మెగా ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. భారీగా పెరిగిన స్టాక్ ఇదే..
Gautam Adani: భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఏదైనా అనుకున్నాడంటే తప్పుకుండా దానిని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
కొత్త వారం ప్రారంభమైన తొలిరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు వారం మొదటి ట్రేడింగ్ రోజు ట్రేడింగ్ సెషన్లో దాదాపు 3% పైగా పెరిగి రూ.2,459కి చేరుకున్నాయి. ఇదే క్రమంలో గ్రూప్ లోని ఇతర కంపెనీల షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా కొనుగోలు నమోదైంది.

సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 1.63%, అదానీ విల్మార్ 2.38%, అదానీ పవర్ 2.27%, అదానీ ట్రాన్స్‌మిషన్ 2%, అదానీ టోటల్ గ్యాస్ 2.19%, అదానీ గ్రీన్ 0.74%, ఏసీసీ 1.41%, అంబుజా సిమెంట్స్, NDTV షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం 259 హెక్టార్ల ధారావి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ ప్రాపర్టీస్‌కు అధికారికంగా అప్పగించింది. దీనిని గత ఏడాది నవంబర్‌లో అదానీ ప్రాపర్టీస్ బిడ్డింగ్ ద్వారా దక్కించుకుంది. దీనికోసం అదానీ ప్రాపర్టీస్‌తో రియల్టీ సంస్థలు DLF, నమన్ డెవలపర్స్ పోటీ పడ్డాయి. రూ.5,069 కోట్లతో బిడ్ దాఖలు చేసిన అదానీ గ్రూప్ చివరికి విజేతగా నిలిచింది. అదే సమయంలో DLF లిమిటెడ్ 2025 కోట్ల రూపాయల బిడ్ వేసింది. అయితే టెక్నికల్ బిడ్డింగ్‌లో నమన్ గ్రూప్ అర్హత సాధించలేకపోయింది.
ఈ ప్రాజెక్టు కింద 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 6.5 లక్షల మంది మురికివాడల నివాసితులకు పునరావాసం కల్పించే ప్రణాళికలో భాగంగా అదానీకి ప్రాజెక్టు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కాలపరిమితి 7 ఏళ్లు. సెంట్రల్ ముంబైలోని బ్రాండా-కుర్లా కాంప్లెక్స్ సమీపంలోని ఈ ప్రాజెక్టులో రూ.20,000 కోట్లతో పునరాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తాజాగా దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు అదానీ గ్రూప్ కు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి ఎగబాకాయి.


Click it and Unblock the Notifications