Adani News: ఒక్కసారిగా అదానీ మార్కెట్ క్యాప్ వేల కోట్లు పెరిగింది. ఇదంతా జరిగింది కేవలం రెండు రోజుల్లోనే కావటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు అదానీ స్టాక్స్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం..

పెరిగిన మార్కెట్ క్యాప్..
అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 39,000 కోట్లు పెరగటానికి వెనుక అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ & సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ దోహదపడ్డాయి. దీంతో గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.7.50 లక్షల కోట్ల మార్కుకు పెరిగింది. దీనికి ప్రధానంగా అదానీ కంపెనీలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకమే కారణంగా తెలుస్తోంది. ఇందుకోసం గ్రూప్ సింగపూర్, హాంకాంగ్‌లలో స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్..
ఈరోజు ఉదయం అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 10 శాతం పెరిగి రూ.1,500 స్థాయికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,71,051 కోట్లకు చేరుకుంది. దీనికి ముందు మంగళవారం స్టాక్ 14.3 శాతం మేర లాభపడింది. కంపెనీ అనుబంధ సంస్థ ముంద్రా అల్యూమినియం ఒడిశాలోని కుట్రుమాలి బాక్సైట్ బ్లాక్ కోసం ప్రాధాన్య బిడ్డర్‌గా ప్రకటించబడింది. లహండి, రాయగడ జిల్లాల్లోని బ్లాక్‌లలో 128 మిలియన్ టన్నుల ఖనిజం ఉంది.

అదానీ పోర్ట్స్..
రెండవ అత్యంత విలువైన గ్రూప్ స్టాక్ అదానీ పోర్ట్స్ & SEZ . ఈ కంపెనీ ఇప్పటి వరకు మార్కెట్ క్యాప్‌లో రూ.4,277 కోట్లు జోడించింది. ఇది మంగళవారం ముగింపు నాటికి 1,28,010 కోట్ల మార్కెట్ క్యాప్ ను కలిగి ఉంది. ఈ రోజు సైతం స్టాక్ లాభాల్లో కొనసాగుతున్న తరుణంలో మార్కెట్ క్యాప్ భారీగానే పెరిగింది. ఈ క్రమంలో స్టాక్ ధర గరిష్ఠంగా రూ.615.85 స్థాయిని తాకింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ..
గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ పెరుగుదలకు కీలకంగా ఉన్న కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఒకటని చెప్పుకోవాలి. ఈ సంస్థ రూ.3,841 కోట్లను మార్కెట్ క్యాప్ కు జోడించింది. సెప్టెంబర్ 2024లో అదానీ గ్రీన్ ఎనర్జీ 750 మిలియన్ డాలర్ల 4.375 శాతం బాండ్‌ను రీఫైనాన్స్ చేయడానికి.. అదానీ గ్రూప్ 800 మిలియన్ డాలర్ల రుణ సదుపాయం కోసం దృఢ నిబద్ధతను పొందినట్లు నివేదికలు ప్రకారం తెలుస్తోంది.

అదానీ టోటల్ గ్యాస్..
ప్రస్తుత తరుణంలో అదానీ టోటల్ గ్యాస్ షేరు ధర గరిష్ఠంగా రూ.714.20కి చేరింది. దీని మార్కెట్ క్యాప్ రూ.3,739.36 కోట్లు పెరిగి రూ.78,548.44 కోట్లకు చేరింది. ఇదే సమయంలో అదానీ ట్రాన్స్‌మిషన్ మార్కెట్ క్యాప్ రూ.3,580.73 కోట్లు పెరిగి రూ.75,256.71కి చేరుకుంది. అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ ధర 2.40 శాతం పెరిగి రూ.658కి చేరుకుంది. ఇక అదానీ పవర్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్ కంపెనీలు గ్రూప్ మార్కెట్ క్యాప్‌కు రూ. 2,000-3,000 కోట్లను అందించాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications