Adani One: డిజిటల్ సేవల్లోనూ దూసుకొచ్చేసిన అదానీ.. అదానీ వన్ పేరుతో సర్వీసేస్..
Adani One: వ్యాపారంలో అంబానీ, అదానీలు లైటనింగ్ స్పీడ్ తో విస్తరణను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ సోమవారం తన వినియోగదారుల ప్లాట్‌ఫారమ్ 'అదానీ వన్'ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

అదానీ వన్ సర్వీసెస్..
తొలుత అదానీ వన్ సేవలను కంపెనీ తన విమానాశ్రయ రంగం కోసం రూపొందించింది. దీని ద్వారా వినియోగదారులు విమానాలు, క్యాబ్‌లు, విమాన స్థితిని తనిఖీ చేయడం, డ్యూటీ-ఫ్రీ ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడంతో పాటు మరిన్ని సేవలను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ డిజిటల్ సేవల ద్వారా మరో అడుగు ముందుకేసినట్లు కంపెనీ పేర్కొంది.

సీనియర్ వైస్ ప్రెసిడెంట్..
సాంప్రదాయ వ్యాపారాలకు సమాంతరంగా డిజిటల్ సేవలను నిర్మించడం సంతోషంగా ఉందని, ఇది అందరి సమిష్ట కృషితో సాధ్యమైందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ బిజినెస్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ నితిన్ సేథి అన్నారు. కస్టమర్ ఆసక్తులు, ఫీడ్‌బ్యాక్‌లు టచ్‌పాయింట్‌లలో వారి అనుభవాన్ని మెరుగుపరచడంలో తమకు ఉపయోగపడతాయని ఆయన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో స్పష్టం చేశారు.

విమానాశ్రయాలు..
అదానీ గ్రూప్ ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి, తిరువనంతపురంలలో ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలు ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులను ఇతర అదానీ గ్రూప్ సేవలతో కనెక్ట్ చేయడానికి రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో 'సూపర్ యాప్'ని ప్రారంభించాలని యోచిస్తోందని అదానీ ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ఇందులో భాగంగా అదానీ గ్రూప్, ఉబెర్ సంయుక్తంగా పికప్ జోన్‌లను ఏర్పాటు చేశాయి. దీనికి ముందు అదానీ గ్రూప్ గత సంవత్సరం ట్రావెల్ యాప్ క్లియర్‌ట్రిప్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications