Adani: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అదానీ గ్రూప్.. ప్రపంచంలోనే రెండో ర్యాంక్ సొంతం

Renewable Energy: ఈ ఏడాది ప్రారంభంలో హిండెన్ బెర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల అదానీ గ్రూప్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అనంతరం మెల్లమెల్లగా తిరిగి పుంజుకుంది. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగింది. అమెరికా కోర్టు సైతం అదానీ గ్రూప్ పై ఆరోపణలను ఇటీవల కొట్టివేసింది. ఈ సమయంలో ప్రపంచస్థాయి గుర్తింపు రావడంతో మరోసారి హవా చాటేందుకు సిద్ధమవుతోంది.

భారీ స్థాయి సోలార్ PV డెవలపర్లలో దేశానికి చెందిన అదానీ గ్రూపు ప్రపంచంలోనే రెండో ర్యాంకు సాధించింది. మెర్‌కామ్ క్యాపిటల్ ఇచ్చిన ఈ ర్యాంకింగ్స్ పట్ల కంపెనీ ఛైర్మన్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పునరుత్పాదక శక్తి రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ.. తమ స్థిరమైన నిబద్ధతకు దీన్ని గుర్తింపుగా భావిస్తున్నట్లు చెప్పారు.

Adani group secured second rank in worlds large-scale solar PV developers

2030 నాటికి 45 గిగావట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్ధ్యాన్ని సాధించాలనే మా లక్ష్యానికి ఈ గుర్తింపు బూస్ట్ ఇచ్చినట్లు అయిందని గౌతమ్ అదానీ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్ Xలో తన ఆనందాన్ని పంచుకున్నారు. తన పోస్టులో #COP28 హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు. సౌరశక్తి ల్యాండ్ స్కేప్‌ లో తమ గణనీయమైన సహకారాన్ని ఇది హైలెట్ చేసినట్లు చెప్పారు.

వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయిలో COP28 సమ్మిట్‌ లో ప్రపంచ నేతలు వాడివేడిగా చర్చలు జరుపుతున్నారు. ఈ తరహా విపత్తు నిర్వహణలో తాము చురుకైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబించగలమని X పోస్ట్ ద్వారా అదానీ పరోక్షంగా వెల్లడించారు. ఈ సమయంలో తమ గ్రూప్‌ కు లభించిన గుర్తింపు కీలకమని భావిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+