Adani News: అదానీ గ్రూప్ కంపెనీల్లో అజ్ఞాత విదేశీ పెట్టుబడుల గురించి OCCRP చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ ఒక మీడియా స్టేట్మెంట్ విడుదల చేసింది.
తాజాగా OCCRP చేసిన ఆరోపణలను తాము తిరస్కరిస్తున్నట్లు అదానీ గ్రూప్ తన ప్రకటన ద్వారా వెల్లడించింది. జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసిన సంస్థ చేస్తున్న తాజా ఆరోపణలు రీసైకిల్ చేసిన పాత విషయాలేనని కొట్టిపారేశింది. హిండెన్ బర్గ్ నివేదికను పునరుద్ధరించటానికి ఇది ప్రయత్నించిందని వెల్లడించింది. విదేశీ మీడియా ఈ విషయాన్ని కావాలనే రాద్దాంతం చేస్తోందని ఖండించింది. ఇది ముందుగా ఊహించిందేనని పేర్కొంది.

దశాబ్ధాల కిందట డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఓవర్ ఇన్వాయిసింగ్ గురించి దర్యాప్తు చేసి మూసివేసిన కేసు ఆధారంగా చేస్తున్న ఆరోపణలని అదానీ గ్రూప్ వెల్లడించింది. అయితే అప్పట్లో స్వతంత్ర న్యాయనిర్ణేత అధికారం, అప్పీలేట్ ట్రిబ్యునల్ లావాదేవీలు చట్టబద్ధంగానే ఉన్నట్లు ధృవీకరించాయని గుర్తుచేశారు. 2023 మార్చిలో గౌరవనీయులైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ విషయం తుదిదశకు చేరుకుందని, స్పష్టంగా, ఓవర్ వాల్యుయేషన్ లేనందున నిధుల బదిలీపై ఈ ఆరోపణలకు ఎటువంటి బేస్ లేదని అదానీ గ్రూప్ చెబుతోంది.
ఈ FPIలు ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) దర్యాప్తులో భాగంగా ఉన్నాయని అదానీ గ్రూప్ వెల్లడించింది. గౌరవనీయమైన సుప్రీం కోర్ట్ నియమించిన నిపుణుల కమిటీ ప్రకారం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్(MPS) అవసరాలను ఉల్లంఘించినట్లు లేదా స్టాక్ ధరల తారుమారుకి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న విదేశీ సంస్థలు తమ ప్రయత్నాల ద్వారా అదానీ గ్రూప్ స్టాక్ ధరలను తగ్గించి తద్వారా లాభాలను ఆర్జించడం కోసం ప్రయత్నిస్తున్నాయని గ్రూప్ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ షార్ట్ సెల్లర్‌లు వివిధ అధికారులచే విచారణలో ఉన్నాయని తెలిపింది.


Click it and Unblock the Notifications