Adani: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల దేశీయ దిగ్గజ అదానీ గ్రూపు సంస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే ప్రజలు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనడానికి ఇప్పటికే పలు ప్రయత్నాలు చేసింది, చేస్తూనే ఉంది. పెద్ద మొత్తంలో రుణాలను మెచ్యూర్ కాకముందే చెల్లించి, రుణ విముక్తి సాధించే దిశగా అడుగులు వేసింది.
ముందస్తు చెల్లింపు ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 2.65 బిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించినట్లు అదానీ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థ విడుదల చేసిన క్రెడిట్ నోట్‌లో పలు విషయాలను వెల్లడించింది. గ్రూపులోని లిస్టెడ్ సంస్థల్లో వాటాలను తాకట్టు పెట్టి 2.15 బిలియన్ డాలర్ల రుణాలు తీసుకున్నట్లు చెప్పింది. అంబుజా సిమెంట్ కొనుగోలు కోసం తీసుకున్న మరో 700 మిలియన్ డాలర్లను పూర్తిగా పే చేసినట్లు ప్రకటించింది.

"203 మిలియన్ డాలర్ల వడ్డీతో కలిపి ప్రీపేమెంట్స్ చేయడం జరిగింది" అని కంపెనీ తెలిపింది. నాలుగు లిస్టెడ్ గ్రూప్ ఎంటిటీలలోని షేర్లను ప్రముఖ ప్రపంచ పెట్టుబడి సంస్థ అయిన GQG పార్ట్‌నర్స్‌కి 1.87 బిలియన్ డాలర్లకు ప్రమోటర్లు విక్రయించారు. అస్థిర మార్కెట్ పరిస్థితులలో కూడా స్పాన్సర్ స్థాయిలో బలమైన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ మరియు క్యాపిటల్ యాక్సెస్‌కు ఈ ఉదంతం సాక్ష్యంగా నిలిచిందని తన క్రెడిట్ అప్‌డేట్‌లో పేర్కొంది.
కీలక ఆర్థిక గణాంకాలలో మంచి మెరుగుదల కనబడినట్లు క్రెడిట్ అప్‌డేట్ హైలైట్ చేసింది. నెట్ డెబ్ట్ టు EBITDA నిష్పత్తి FY22లో 3.81 ఉండగా.. FY23లో 3.27కి తగ్గడం విశేషం. EBITDA రన్ రేట్ FY22లో ఉన్న 50 వేల 706 కోట్ల నుంచి 66,566 కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్ విభాగం కొత్త రుణాలను పంపిణీ చేయడం, ఇప్పటికే ఉన్న క్రెడిట్ లైన్లపై రోలింగ్ చేయడం వల్ల పెట్టుబడిదారులు విశ్వాసాన్ని చూపుతారని క్రెడిట్ అప్‌డేట్ అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications