Adani Enterprises: అమెరికాకు చెందిన హిండెన్‌బెర్గ్ పరిశోధనా నివేదిక వల్ల అదానీ గ్రూపునకు ఎంత నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో పార్లమెంట్‌లోనూ ఈ ఉదంతంపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు సైతం పట్టుబట్టాయి. వాటన్నిటికీ భయపడకుంటా తిరిగి తన సంస్థలను గాడిలో పెట్టడంలో గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ చూపిన తెగువను ప్రశంసించాల్సిందే.
2023 ప్రారంభంలో అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల వల్ల గౌతమ్ అదానీ సామ్రాజ్యం కుప్పకూలింది. దాదాపు 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే నష్టాలను చవిచూసింది. అయితే అంచెలంచెలుగా రుణాలను తగ్గించుకుంటూ, పెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుని పోగొట్టుకున్న సంపదను తిరిగి దక్కించుకోగలిగారు.

ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఇవాళ ఒకానొక సమయంలో 1.7 శాతం పెరిగి 3,445కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో ఏర్పడిన నష్టాలతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 3 రెట్లు పెరిగింది. వచ్చే నెలలో బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆ స్టాక్ చేర్చబడుతుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ స్టాక్స్‌లో కనీసం 5.. హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు స్థాయిల కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. దీనికితోడు గ్రూప్ తన సిమెంట్ మరియు రాగి వ్యాపారాలను విస్తరించే ప్రణాళికలతో గ్రూప్ ముందుకు సాగుతోంది. ఇందుకోసం ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. ఈ కారణాల వల్ల సదరు స్టాక్స్ మరోసారి తిరిగి పుంజుకుంటున్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications