Adani Loans: రెండేళ్ల ముందే రుణాన్ని ప్రీపే చేసిన అదానీ గ్రూప్.. ఇన్వెస్టర్స్ హ్యాపీ..

Adani Loans: వివాదాస్పదాల్లో చిక్కుకున్న తర్వాత అదానీ గ్రూప్ తన ప్లాన్ పూర్తిగా మార్చుకుంది. కంపెనీలకు ఉన్న రుణాల భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ముందుగా మాట ఇచ్చిన విధంగానే తన అప్పులను గడువు కంటే ముందరే చెల్లిస్తోంది. అదానీ గ్రూప్ చేస్తున్న ఈ పని ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపుతోంది.

లోన్స్ ప్రీ-పే..

లోన్స్ ప్రీ-పే..

షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను కంపెనీ తాజాగా చెల్లించినట్లు ప్రకటించింది. దీని ప్రకారం వివిధ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల వద్ద తీసుకున్న రూ.7,374 కోట్లను గడువు కంటే రెండేళ్లు ముందరే చెల్లించింది. మిగిలిన అన్ని రుణాలను మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రకటించింది. లిస్టెడ్ కంపెనీల షేర్ల మద్దతుతో మొత్తం ప్రమోటర్ పరపతిని తగ్గించే ప్రణాళికలో ఈ చర్య భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాకట్టు నుంచి బయటకు..

తాకట్టు నుంచి బయటకు..

భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించడం ద్వారా గ్రూప్ లిస్టెడ్ షేర్లలో నాలుగు - అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌కి చెందిన 155 మిలియన్ షేర్లు (11.8% ప్రమోటర్ల హోల్డింగ్), అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కు చెందిన 31 మిలియన్ షేర్లు (4 %), అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ కు చెందిన 36 మిలియన్ షేర్లు (4.5%), అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి చెందిన 11 మిలియన్ షేర్లు (1.2%) తాకట్టు నుంచి బయటకు రానున్నాయి. ప్రమోటర్ల వాటాలు విడిపించటం కంపెనీలకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి.

2023లో మెుత్తంగా..

2023లో మెుత్తంగా..

ఫిబ్రవరిలో చేసిన రీపేమెంట్‌లతో కలిపుకుంటే అదానీ గ్రూప్ ఇప్పటి వరకు 2,106 మిలియన్ డాలర్ల షేర్-బ్యాక్డ్ ఫైనాన్సింగ్‌ను గడువు కంటే చాలా ముందర చెల్లించింది. హిండెన్ బెర్గ్ అదానీ గ్రూప్ రుణాలపై, అకౌంటింగ్ పై చేసిన అనేక ఆరోపణలకు సమాధానం చెప్పటంతో పాటు తన ఇన్వెస్టర్ల నమ్మకాన్ని, సంపదను కాపాడేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 అంతర్జాతీయంగా రోడ్ షోలు..

అంతర్జాతీయంగా రోడ్ షోలు..

అదానీ గ్రూప్ లండన్, దుబాయ్, US అంతటా రోడ్ షోలను ప్రారంభించింది. దీనికి ముంది సింగపూర్, హాంకాంగ్ నగరాల్లోనూ ఇలాంటి రోడ్ షోలను నిర్వహించి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపేందుకు కార్యాచరణను రూపొందించింది. US షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన దారుణమైన నివేదికతో గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు పతనమైన తర్వాత దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు కోల్పోయిన విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం రోడ్ షో టూర్ కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అదానీ వెనకడుగు..

అదానీ వెనకడుగు..

ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ కొత్తగా వ్యాపారాలను కొనుగోలు చేయటంపై కొంత వెనకడుగు వేసింది. ఇప్పుడు దూకుడు తగ్గించి నెమ్మదిగా, స్థిరమైన పునరుద్ధరణపై దృష్టి సారిస్తోంది. రూ.7,000 కోట్ల బొగ్గు కర్మాగారం కొనుగోలును రద్దు చేయడం, ఇంధన వ్యాపార సంస్థ PTCలో వాటా కోసం బిడ్‌ను వదులుకోవడంతో పాటు ఖర్చులు తగ్గించే కార్యక్రమాలు చేపట్టడం దీనికి సాక్షిగా నిలిచాయి. గడచిన నాలుగేళ్ల కాలంలో అదానీ గ్రూప్ స్థూల రుణం రెండింతలు పెరిగింది. నగదుతో సహా నికర అప్పు 2023లో రూ.1.89 లక్షల కోట్లుగా ఉందని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+