Adani News: అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ తాజాగా తన ఎఫ్ఎమ్సీజీ బిజినెస్ విక్రయించాలని చూస్తోందనే వార్తలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే అదానీ విల్మార్‌లో 43.97 శాతం వాటాను విక్రయించేందుకు అదానీ గ్రూప్ అనేక బహుళజాతి వినియోగ వస్తువుల కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నెల రోజుల్లోగా డీల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. తన వాటా విక్రయం ద్వారా అదానీ గ్రూప్ 2.5 నుంచి 3 బిలియన్ డాలర్లను పొందాలని చూస్తోంది.

దేశీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ప్రముఖ ఫార్చ్యూన్ బ్రాండ్ ఎడిబుల్ ఆయిల్స్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న అదానీ విల్మార్ అనేది అదానీ గ్రూప్, సింగపూర్‌కు చెందిన విల్మార్ ఇంటర్నేషనల్ మధ్య ఒక జాయింట్ వెంచర్. ఇది 1999లో స్థాపించబడింది. ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ వార్తపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కోర్ ఫోకస్ ఏరియాలలో లోతుగా పెట్టుబడి పెట్టడానికి గ్రూప్ కొన్ని వ్యాపారాల నుండి నిష్క్రమించాలని యోచిస్తోందని సమాచారం. తాజాగా అదానీ విల్మార్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలు ఆ ప్లాన్‌లలో భాగమేనని నివేదికలు చెబుతున్నాయి.
లిక్విడిటీ బఫర్‌ను సృష్టించేందుకు గ్రూప్ నాన్-కోర్ ఆస్తుల నుంచి నిష్క్రమిస్తున్నట్లు నివేదికలు గత కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్నాయి. అదానీ విల్మార్.. ఫార్చ్యూన్ బ్రాండ్‌తో పాటుగా.. గోధుమ పిండి, బియ్యం, పప్పులు, చక్కెరతో సహా ఇతర ఉత్పత్తులను విక్రయిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications